ఒక పాత బొమ్మలో చిన్న ముక్క
రోడ్డుమీద పడి ఉంది.
ఒక పాత బొమ్మలో చిన్న ముక్క
వానలో తడుస్తూంది.
అది అలవాటుగా షూ వేసుకునే
స్త్రీ తొడుక్కున్న కోటుకి
ఉండే నీలిరంగు బొత్తాము కావచ్చు.
అది magic bean గాని
ఒక మహారాణి గారు ధరించిన ఎర్రని
మొకమలు వస్త్రంమీది మడత కావొచ్చు,
లేదా, Snow White కి
సవతి తల్లి ఇచ్చిన ఏపిలును ఆమె
కొరికినపుడు పడిన పంటి గాటు కావొచ్చు.
అది ఒక పెళ్ళికూతురు వేసుకున్న ముసుగో,
అల్లరి భూతాన్ని బంధించిన సీసానో కావొచ్చు.
అది బాగా పొడుచుకొచ్చిన
Bobo The Bear పొట్టమీది
రోమాల గుంపు కావొచ్చు,
లేదా Witch of the West
పొగై గాలిలో కలిసిపోయేముందు
ధరించిన కోటులో చిన్న భాగం కావొచ్చు.
అది ఒక దేవదూత కంటినుండి కారిన
కన్నిటి చుక్కల లీలామాత్రపు జాడ కావొచ్చు.
ఆ పాత బొమ్మ ప్రహేళికకి అఏదైనా అవడానికి
ఉన్నన్ని అవకాశాలు మరి దేనికీ లేవు.
.