మీ మీ ఇళ్ళలో భద్రంగా, వెచ్చగా గుమ్మటంలా ఉంటూ సాయంత్రం ఇంటికి రాగానే నవ్వుముఖాలూ, వేడివేడి భోజనం ఎదురుచూసే మీరు ఒకసారి ఆలోచించండి
కేవలం ఒక రోట్టెముక్క కోసం బురద కొట్టుకునేలా చాకిరీచేస్తున్నా మనశ్శాంతి అన్నది ఎరుగక, అవును, కాదు అన్న ఒక నిర్ణయానికి బలి అయే ఇతనూ ఒక మనిషిబ్రతుకే?
శుభ్రమైన తలకట్టుగాని, పేరుగాని లేక ఉన్నా గుర్తుపెట్టుకునే శక్తి లేక శీతకాలంలోని కప్పలా కళ్ళు శూన్యంలోకిచూస్తూ, గర్భంవట్టిపోయి అలమటించే ఈమెదీ ఒక ఆడబ్రతుకే?
ఇన్నాళ్ళబట్టీ ఇలాగే నడుస్తోందన్నదీ ఆలోచించండి: అందుకే మీకు ఈ మాటలు విన్నవించుకుంటున్నాను మీ హృదయాల్లో చెరిగిపోకుండా దాచుకోండి: మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీరు రహదారిమీద నడుస్తున్నప్పుడు మీరు నిద్రపోతున్నప్పుడూ, నిద్రలేచినపుడు, ఈ మాటలు పదే పదే మీ పిల్లలకు చెప్పండి. లేకపోతే మీ ఇళ్ళు కూలిపోవుగాక! రోగాలు మిమ్మల్ని నిర్వీర్యం చేయుగాక! మీ పిల్లలు మిమ్మల్ని చూసి ముఖం తిప్పుకుందురుగాక! . ప్రీమో లెవీ
స్పందించండి