తను స్వారీ చెయ్యగల గుఱ్ఱాన్ని గాని, నడపగలిగిన పడవనిగాని ఒక మనిషికి ఇచ్చిచూడు; అతని హోదా, సంపద, బలం ఆరోగ్యం నేలమీదైనా, నీటిమీదైనా చెక్కుచెదరవు.
ఒకమనిషికి వాడు తాగగలిగిన పొగాకుగొట్టాన్నిగాని, వాడు చదవగలిగిన పుస్తకాన్నిగాని ఇచ్చి చూడు; అతని గదిలో పేదరికం తాండవించవచ్చునేమోగాని, అతని ఇల్లు ప్రశాంతతతో ఆనందంతో కళకళలాడుతుంది.
నేను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు, ప్రేయసీ, ఒక పురుషుడికి అతనికి మనసైన స్త్రీని ఇచ్చి చూడు అతని హృదయం అదృష్టస్పర్శతో ఉదాత్తమౌతుంది ఇంట్లోనూ, నేలమీదా, నీటిమీదా! .
స్పందించండి