పైకి కొంచెం అన్వయ క్లిష్టత కనిపించినా, ఇది ఒక ఏకాకి ఆత్మరోదన. అందులోనూ ఎన్నడూ ప్రేమ రుచి చూడని వాడు. సౌందర్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. కానీ సౌందర్య దృష్టి ఉన్నప్పుడే. కవి ఉద్దేశ్యంలో అందం పరమర్థం వేరే. అది చివరన చెబుతాడు. ప్రేమ ఎరుగని మనసుకి మృత్యువులోనే సాంత్వన దొరుకుతుంది. లేదా, కేవలం ప్రకృతిలో మమేకమైనపుడు. (అందుకే ఇందులో చక్కని ప్రకృతిదృశ్యాల వర్ణన. గుండెకోతను, నీటిని సన్నని కెరటాల తెరలుగా పిల్లగాలికోయడం ఒక అపురూపమైన ఉపమానం.} పాపం ఈ నిర్భాగ్యుడు మృత్యువులోనే ప్రశాంతత కోరుకుంటున్నాడు. శిధిలమైన తన శరీరాన్ని కీటకాలైనా ప్రేమిస్తాయన్న ఆశ అతనికి ప్రశాంతతనిస్తుంది. అందం ఇవ్వగలిగిన పరమార్థం అదే!
***
అందం అంటే ఏమిటి? అలసటతో, కోపంతో, అసహనంగా ఉన్న నాకు
ఎంత అందంగా ఉన్నా ఇప్పుడు ఏ పురుషుడూ, స్త్రీ, పసిపాపడూ
నన్నాకట్టుకో లేరు. అయినా, ఇపుడు ధైర్యంగా నవ్వగలను.
కారణం తీరుబాటుగా ఈ స్మృతిశ్లోకాన్ని రాసుకుంటున్నాను గనుక:
“ఇక్కడ ఎవరినీ ప్రేమించనివాడూ, ఎవరూ ఇతన్ని ప్రేమించనివాడూ
నిద్రపోతున్నాడు”. మరుక్షణంలోనే ఆ పిచ్చి ఆలోచనా
తలపులో ఎక్కువసేపు నిలవదు. నేనిపుడు సాయంసంధ్యవేళ
ఎన్నడూ ఎండ ఎరుగని, ఎండకు కాగని నదితీరున కనిపించినా,
నా ఉపరితలాన్ని పిల్లగాలి సన్ననిపొరలుగా చీలుస్తున్నా,
ఈ మనసు, నా శరీరంలోని ఒక తునక, ఇప్పటికీ
మసకచీకటిలో, పొగమంచులో మునిగిన లోయలోని
చెట్లవైపు కిటికీగుండా ప్రశాంతంగా తేలిపోతుంది;
తీతువుపిట్టలా ఏదో పొగొట్టుకున్న దానికోసం మాటిమాటికీ
ఏడవకుండా, ప్రేమకి స్పందించకుండా తన గూటికి
దూరంగా ఎటో పావురంలా ఎగిరిపోతుంది.
అందులోనే నాకు విశ్రాంతి ఉంది. ఆ మునిమాపువేళ పిల్లగాలుల్లో
ఎగిరే కీటకాలు నాలో బ్రతికి ఉంటాయి. అందం ఉన్నదక్కడే!
.
ఎడ్వర్డ్ థామస్
(3 March 1878 – 9 April 1917)
వెల్ష్ కవి
.

(3 March 1878 – 9 April 1917) British Poet
స్పందించండి