లాంతరుకంటే వెలుగే ముఖ్యం… నిజార్ కబ్బానీ, సిరియన్ కవి
లాంతరు కంటే వెలుగే చాలా ముఖ్యం,
రాసిన పుస్తకం కంటే, కవితే ఎంతో ముఖ్యం,
పెదాలకంటే, ముద్దు ఎక్కువ ముఖ్యం
నేను నీకు రాసిన ప్రేమలేఖలు
మనిద్దరికన్నా గొప్పవీ, ఎంతో ముఖ్యమైనవీ
ఎందుకంటే, ప్రజలు
నీ అందాన్నీ,
నా పిచ్చినీ
తెలుసుకోగలిగిన
ఆధారపత్రాలు అవి.
.
నిజార్ కబ్బానీ
(21 March 1923 – 30 April 1998)
సిరియను కవి.
స్పందించండి