నిష్క్రమణ… హెన్రిక్ ఇబ్సెన్, నార్వేజియన్ కవి,నాటకకర్త
చివరగా… ఆఖరునవచ్చిన అతిథి
వీధివరకు గుమ్మం వరకు సాగనంపేం;
శలవు… తక్కిన మాటల్ని
రాత్రి రొజ్జగాలి మింగేసింది.
ఇంతదాకా వినిపించిన తియ్యని మాటలు
చెవులకు సంగీతంలా వినిపించేయి…
ఇక ఈ ఇల్లూ, తోటా, వీధీ
పదిరెట్లు బావురుమంటూ ఉన్నాయి.
ఇది కేవలం చీకటిపడుతూనే
ఏర్పాటుచేసిన ఒక విందు.
ఆమె కేవలం ఒక అతిథి,
ఇప్పుడు, ఆమెకూడా వెళ్ళిపోయింది
.
హెన్రిక్ ఇబ్సెన్
నార్వేజియన్ కవి, నాటకకర్త, దర్శకుడు.
.

Henrik Ibsen
Photo Courtesy: Wikipedia
.
GONE
.
THE last, late guest
To the gate we followed;
Goodbye — and the rest
The night-wind swallowed.
House, garden, street,
Lay tenfold gloomy,
Where accents sweet
Had made music to me.
It was but a feast
With the dark coming on;
She was but a guest —
And now, she is gone.
.
Henrik Ibsen
20 March 1828 – 23 May 1906
Norwegian Poet, Playwright and Theatre Director
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి