అప్పుడే విచ్చుకుంటున్న మసక వెలుగులో
అతను తన సహచరుల ముఖాలు చూస్తున్నాడు,
సిమెంటు దుమ్ముకొట్టుకుని
ఆ పొగమంచులో కనీకనిపించకుండా,
కలత నిదురలలొనే మృత్యువువాత పడి.
రాత్రివేళ, వాళ్ళ కలల బరువుకి
నిద్రలోనే వాళ్ళదవడలు కదులుతున్నాయి
అక్కడలేని టర్నిప్ ని ఊహించుకు నములుతూ
“నీటమునిగిన మిత్రులారా! దూరంగా పొండి!
పొండి! నా మానాన్న నన్ను విడిచిపెట్టండి.
నేను మిమ్మల్నెవర్నీ వంచించలేదు.
మీ నోటిముందరి రొట్టె లాక్కోలేదు.
నాకు బదులుగా మరొకరిని ఎవరినీ
బలిచెయ్యలేదు. ఏ ఒక్కరినీ.
మీరు తిరిగి ఆ మసకలో కలిసిపోండి.
నేను బతికి బట్టకట్టి, ఊపిరి పీలుస్తూ, తింటూ,
తాగుతూ, నిద్రపోతూ, బట్టలేసుకుంటున్నానంటే
అందులో నా నేరం లేదు!
.
ప్రీమో లెవి
31 July 1919 – 11 April 1987
ఇటాలియన్ కవి.

.
The Survivor
.
Once more he sees his companions’ faces
Livid in the first faint light,
Gray with cement dust,
Nebulous in the mist,
Tinged with death in their uneasy sleep.
At night, under the heavy burden
Of their dreams, their jaws move,
Chewing a non-existent turnip.
‘Stand back, leave me alone, submerged people,
Go away. I haven’t dispossessed anyone,
Haven’t usurped anyone’s bread.
No one died in my place. No one.
Go back into your mist.
It’s not my fault if I live and breathe,
Eat, drink, sleep and put on clothes.’
.
Primo Levi
31 July 1919 – 11 April 1987
Italian Poet and Holocaust Survivor
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
నగరంలోని చప్పుళ్ళు
నా కలల్లో కలగాపులగం అవుతుంటే
ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచాను.
రెండు సింహాలు గర్జిస్తూ
పరువుకోసం పోట్లాడుకుంటున్నాయి.
బహుశా అవి రోడ్డుమీద వాహనాలై ఉండొచ్చు.
వేటగాడు ఏదో అరుస్తున్నాడు
బహుశా అవి వీధిలో అమ్ముకునేవాడి కేకలై ఉండొచ్చు;
కాసేపు అంతా నిశ్శబ్దం
అకస్మాత్తుగా ఆరుబయట ఒక తుపాకిగుండు ప్రతిధ్వని
అది ఏ కారు సైలెన్సరు పగిలిందో
లేదా అది పిల్లవాడి బొమ్మతుపాకీనో.
క్రమంగా నిద్రలోంచి మెలకువ వస్తుంటే,
అసలు చప్పుళ్ళు ఏమిటో తెలుస్తూ ఉంటాయి
పక్కింటివాళ్ళు గోడల్లోంచి
నడుచుకుంటూ వస్తుంటారు
నేను తొలివెలుగు రేకకి ఆవులిస్తుంటాను.
క్రిందింట్లో ముసలాయన
ప్రతిరోజులాగే ఈ రోజూ
రేడియో వింటుంటాడు.
మేడమీదివాళ్ళ పిల్లలు
వాళ్ళ గొంతు పగిలేలా అరుస్తున్నారు.
వీధిలోకివెళ్ళబోతున్నవాళ్ళు
చావడిలో అడుగులు తడబడుతున్నారు.
కానీ నిత్యమూ పోట్లాడుకునే పక్కింటి
కొత్త యువజంట నుండి చప్పుళ్ళేమీ వినరావు!!!
వాళ్ళిద్దరూ చివరకి పదిపోయారా?
ఎప్పటికైనా జరగవలసినట్టు
ఆఖరికి విడిపోయారా?
ఒక్కసారిగా వసారాలోని మనుషులు అరుస్తూ పరిగెడుతున్నారు
వాళ్ల గొంతులో ఆందోళన స్పష్టంగా తెలుస్తుంటే
పక్కమీంచి దిగ్గున లేచాను.
తలుపు కన్నంలోంచి చూడబోతే
పక్కింటాయన కనిపించేడు
అతని చొక్కా నిండా రక్తం మరకలు
అతని చేతిలో ఒక తుపాకీ!
.
ఫెన్నీ స్టెరెన్ బోర్గ్
జననం 1956
డచ్చి కవయిత్రి
.

Fenny Sterenborg
Dutch Poetess
.
Noises
.
I woke up this morning
with the city’s noises
fusing into my dream
A pride of lions
roaring in anger
The traffic, it must have been
A hunter shouting something
but I probably heard a street vendor
For a moment, total silence
then a shot rings out in the wild
Perhaps a car’s broken exhaust
or the toy pistol from a child
The noises slowly become familiar
as I slip out of my dream
I hear the neighbours coming in
through the walls
and I yawn in the dawn’s early gleam
The old man from below
like every morning
is listening to the radio
The children from upstairs
screaming their lungs out
and there are people stumbling in the hallway
as they go about
But from the young couple next door
usually fighting, not a sound
Did they finally reconcile
or at long last break up
like they were bound
Suddenly the people in the hallway scream and run
I hear the panic in their voices
and hurry out of bed
As I look through the peephole
I see the guy from next door
his shirt, bloodshed red
and in his hand a gun.
(June 15, 2006)
.
Fenny Sterenborg
Dutch Poetess
(Born 1956)
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…