రోజు: మే 10, 2019
-
శ్రామికుడు… విలియం డేవిస్ గేలహార్, అమెరికను కవి
ఊఁ , తలెత్తుకు నిటారుగా నిలబడు! నువ్వు నీ దేవునికి ప్రతిరూపానివి! అంతకంటే ఏంకావాలి? దైనందిన జీవన సంఘర్షణలో మొక్కవోకుండా నిలబడే గుండెధైర్యమూ, ఎవరికీ తీసిపోని నిర్మల, దయార్ద్రహృదయమూ నీకున్నాయి! ఏం చెప్పను? ఈ మానవసమూహంలో తిరుగాడే అందరిలాగే నువ్వూ నిజాయితీ పరుడివే; ఏ మహత్తర ప్రణాళికతో సృష్టికి పొద్దుపొడిచిందో ఆ లక్ష్యసాధనలో ఈ ప్రాణికోటిలో ప్రతిఒక్కరిలా నువ్వూ అందులో భాగస్వామివే. నీకు శత్రువు ఎవరు? ఉన్నత పదవిలో ఉన్నవాడా? ధనవంతులలో అగ్రగణ్యుడా? లేక నీ వంక…