నే చెప్పలేదూ… ఇకపై పాపాలు చెయ్యనని?
ప్రభూ, నువ్వే సాక్షివి, చేశాను;
అంతే కాదు, ఇంకా చేస్తూనే ఉన్నాను.
నా తప్పుల్ని దాచ శక్యం కాదు.
ఏం చెయ్యను? మళ్ళీ ప్రమాణంచేసి మాట తప్పనా?
ప్రమాణం చెయ్యడం కేవలం వృధా ప్రయాస.
నాలోని మంచి చెడుని అదుపుచెయ్యలేకపోతోంది;
ఈ ప్రయత్నం తప్పకుండా విఫలమౌతుంది.
ఓహో! ఎందుకు అలా అనుకుంటావు? నీకు భగవంతుడు
ఎంతటి ఆత్మనిగ్రహాన్ని ప్రసాదించేడో నీకు తెలియదు,
తిరిగి ఒట్టుపెట్టుకో, నువ్వు చివరిదాకా నిలబడగలిగితే
దేముడు నీ గతాన్నంతటినీ క్షమిస్తాడు.
అసలు నువ్వు మాటకినిలబడలేనకున్నప్పుడే ప్రమాణం చెయ్యాలి;
మనబలహీనక్షణాల్లో ఎంతబలంగా నిలబడగలమో మాటిచ్చినపుడే తెలుస్తుంది.
నీ దైవం నీకు వేటినీ నిరాకరించలేదు,
అలాటప్పుడు ప్రార్థించవలసిన పూచీ నీదే.
నీ దైవాన్ని నువ్వుచేసిన ప్రమాణాలను నీబెట్టుకోగల
శక్తినిమ్మని వేడుకో; మాటతప్పితే, పశ్చాత్తాపపడు.
మాటతప్పిన ప్రమాణాలకై దుఃఖించు; మళ్ళీ ప్రమాణం చెయ్యి:
కన్నీటితో చేసిన ప్రమాణాలు వృధాగా పోవు.
అలా అయితే, మరొకసారి
నా దారి సరిదిద్దుకుంటానని ప్రమాణం చేస్తున్నా;
ప్రభూ! ‘తధాస్తు’ అని ఆశీర్వదించు
ఆ గొప్పదనమంతా నీకే చెందుతుంది.
.
జార్జి హెర్బర్ట్
(3 April 1593 – 1 March 1633)
వెల్ష్ కవి
.
.
“Said I not so?”
.
స్పందించండి