రోజు: మే 7, 2019
-
నే చెప్పలేదూ?… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి
నే చెప్పలేదూ… ఇకపై పాపాలు చెయ్యనని? ప్రభూ, నువ్వే సాక్షివి, చేశాను; అంతే కాదు, ఇంకా చేస్తూనే ఉన్నాను. నా తప్పుల్ని దాచ శక్యం కాదు. ఏం చెయ్యను? మళ్ళీ ప్రమాణంచేసి మాట తప్పనా? ప్రమాణం చెయ్యడం కేవలం వృధా ప్రయాస. నాలోని మంచి చెడుని అదుపుచెయ్యలేకపోతోంది; ఈ ప్రయత్నం తప్పకుండా విఫలమౌతుంది. ఓహో! ఎందుకు అలా అనుకుంటావు? నీకు భగవంతుడు ఎంతటి ఆత్మనిగ్రహాన్ని ప్రసాదించేడో నీకు తెలియదు, తిరిగి ఒట్టుపెట్టుకో, నువ్వు చివరిదాకా నిలబడగలిగితే దేముడు…