.
ఆకాశం నిర్మలంగా ఉండి చూడడానికి
ప్రకాశవంతంగా ఉన్నా, కొందరు గొణుగుతారు
అంతనిర్మలంగా ఉన్న నీలాకాశంలోనూ
ఎక్కడో నల్లని మరక కనిపించిందంటూ;
కొందరికి వారి చీకటిముసిరినజీవితాలలో
భగవంతుని అనుగ్రహం ఒక్కసారి కలిగినా,
ఒక్క వెలుగురేక తొంగిచూచినా చాలు, హృదయం
కృతజ్ఞతాపూర్వక ప్రేమభావనతో నిండిపోతుంది.
రాజప్రాసాదాలలోని హృదయాలు
అసంతృప్తితో, అహమికతో అడుగుతుంటాయి
జీవితం ఎందుకింత నిస్సారంగా ఉండి
ఏ మంచీ ఎందుకు జరగడం లేదని.
నిరుపేద గుడిసెలలోని మనసులు
ప్రేమ వారిజీవితాలని ఎలా ఆదుకుందో
(అసలా ప్రేమకు అలసట లేదేమో)
తమకి కావలసినవన్నీ ఇచ్చిందని.
.
రిఛర్డ్ చెనో ట్రెంచ్
(9 September 1807 – 28 March 1886)
ఇంగ్లీషు కవి.

Richard Chenevix Trench.
Different Minds
.
SOME murmur when their sky is clear
And wholly bright to view,
If one small speck of dark appear
In their great heaven of blue;
And some with thankful love are filled
If but one streak of light,
One ray of God’s good mercy, gild
The darkness of their night.
In palaces are hearts that ask,
In discontent and pride,
Why life is such a dreary task,
And all good things denied;
And hearts in poorest huts admire
How Love has in their aid
(Love that not ever seems to tire)
Such rich provision made.
.
Richard Chenevix Trench
(9 September 1807 – 28 March 1886)
Anglican Archbishop and Poet
From:
The World’s Best Poetry.
Eds: Bliss Carman, et al.
Volume IV. The Higher Life. 1904.
VI . Human Experience
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
.
నా కొవ్వొత్తి రెండు వైపులా మండుతోంది
అది ఈ రాత్రల్లా వెలగకపోవచ్చు
కానీ, నా శత్రులారా! ఓ నా మిత్రులారా!
అది వెలిగినంతసేపూ అద్భుతమైన కాంతినిస్తుంది.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే,
( 22 February 1892 – 19 October 1950)
అమెరికను కవయిత్రి
.

.
First Fig
.
My Candle burns at both ends;
It will not last the night;
But, ah, my foes, and oh, my friends—
It gives a lovely light!
.
Edna St. Vincent Millay
(February 22, 1892 – October 19, 1950)
American Poet
(Poetry … A Magazine of Verse June 1918 Vol XII No. III
From Figs and Thistles)
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…