.
నాలోని యోగీ, భోగీ
రాత్రీ పగలూ పోట్లాడుకుంటూ ఉంటారు.
సమ ఉజ్జీలేమో, అతి జాగ్రత్తగా, లొంగకుండా
ఒకర్నొకరు తిట్టుకుంటూ
నాకు ఒకపక్క చెమట్లు పట్టేస్తుంటే
సూర్యోదయం మొదలు చీకటిపడేదాకా కొట్టుకుంటారు.
రాత్రయినదగ్గరనుండీ పోరాటం మళ్ళీ ప్రారంభం.
పొద్దుపొడుస్తుంటే వణుక్కుంటూ వాళ్ళని గమనిస్తాను.
ఈసారి ఒకరి అంతు రెండోవాళ్ళు చూసేదాకా కొట్టుకుంటారు.
ఎవరు జయిస్తారన్నది నేను పట్టించుకోను.
ఏవరు గెలిచినా, చివరికొచ్చేసరికి
ఓడిపోయేదాన్ని నేనే!
.
సారా టీజ్డేల్
(8 August 1884 – 29 January 1933)
అమెరికను కవయిత్రి
.

స్పందించండి