పోగొట్టుకున్న నేల… ఈవన్ బోలాండ్, సమకాలీన ఐరిష్ కవయిత్రి . నా కిద్దరు ఆడపిల్లలున్నారు. నేను ఈ జన్మకి కోరుకున్నది ఆ ఇద్దరినే. బహుశా నేను అంతకుమించి కోరుకోలేదేమో! . హాఁ! నేను చారెడు జాగా కూడా కోరుకున్నాను: ఎప్పుడూ ఎవరిపని వారు చేసుకోగలిగే వాతావరణమున్న దీవి, చుట్టూ కొండలమధ్య ఒక నగరం, ఒక జీవ నది … ఉన్న చోట. ఆ నేల నాదని చెప్పుకోగలగాలి. నా స్వంతం. అక్షరాలా నా తాత్పర్యం అదే. వాళ్ళు పెద్దవాళ్ళయిపోయి దూరాభారాన ఉన్నారు. ఇప్పుడు జ్ఞాపకాలే వలస పోతున్నాయి. ఆ తావుల్లో ప్రకృతి అంత సహజంగా కపటమైన ప్రేమ కనిపిస్తుంది. పిల్లల కళ్లల్లో ప్రతిఫలించవలసిన రంగురంగుల కొండలూ కోనలూ పిల్లలు దూరమవడంతో, క్షితిజరేఖలైపోయాయి. రాత్రి కళ్లు బరువెక్కి మగతనిద్రలోకి జారుతున్న వేళల్లో నేను “డబ్లిన్” అఖాతపు తీరాన్ని కలగంటాను, విశాలమైన కొండప్రదేశాన్నీ, నల్లసానపురాతి వాడరేవునీ చూస్తాను. నే నూహించుకుంటాను… సందెచీకటివేళ పడవమీద నిష్క్రమిస్తూ ఆ రోజు నా పిల్లలు ఈ దృశ్యాల్ని చూసి ఇలాగే అనుకుని ఉంటారా అని. వాళ్ళు విడిచిపెడుతున్న ప్రతి వస్తువుమీదా నీడలు ముసురుకుంటుంటే, వాళ్లు వీటిని కలకాలం గుర్తుపెట్టుకుంటారా? అని రేవు ఒడ్డున నిలబడినట్టు ఊహించుకుని పడవ రెయిలింగ్ మీద చివరి చేతిజాడ కనిపించేదాకా నిరీక్షిస్తాను. తర్వాత నన్ను నేను నీటి అడుగున అధోలోకంలో ఊహించుకుంటాను, చీకటి చాలా త్వరగా కమ్ముకొస్తూంటుంది… ఆ నేలనుపోగొట్టుకున్న మనుషుల చిఠ్ఠా చదువుతూ… . ఈవన్ బోలాండ్ జననం 1944 ఐరిష్ కవయిత్రి . . The Lost Land I have two daughters. They are all I ever wanted from the earth. Or almost all. I also wanted one piece of ground: One city trapped by hills. One urban river. An island in its element. ……. text deleted intentionally for copyright reasons …….. shadows falling on everything they had to leave? And would love forever? And then I imagine myself at the landward rail of that boat searching for the last sight of a hand. I see myself on the underworld side of that water, the darkness coming in fast, saying all the names I know for a lost land: . EAVAN BOLAND Born 1944 Irish Poetess Read the complete poem here: https://www.poetryfoundation.org/poems/50003/the-lost-land Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఏప్రిల్ 29, 2019