ప్రజాస్వామ్యం
భయంద్వారా, రాజీద్వారా,
ఈ రోజు కాదు, ఈ ఏడు కాదు
ఏనాటికీ
సాధించబడదు.
నా రెండు కాళ్ళ మీద
నిలబడడానికీ,
కాసింత నేల కొనుక్కుందికీ
అవతలివ్యక్తికి ఎంతహక్కుందో
నాకూ అంతే హక్కు ఉంది.
దేని సమయం దానికి కావాలి అని అందరూ
అనడం విని విని విసిగెత్తిపోయింది.
రేపన్నది, మరో రోజు
నేను చచ్చిన తర్వాత
నాకు స్వాతంత్య్రం అవసరం లేదు.
రేపటి రొట్టితిని ఈ రోజు బ్రతుకలేను.
స్వాతంత్య్రం
గొప్ప అవసరంలో
పాతిన
బలమైన విత్తనం.
నేనుకూడా ఇక్కడే బ్రతుకుతున్నాను.
నీ కెలాగో
నాకూ అలాగే స్వాతంత్య్రం కావాలి.
.
లాంగ్స్టన్ హ్యూజ్
February 1, 1901 – May 22, 1967
అమెరికను కవి

స్పందించండి