సంగీత స్తుతి… రైనర్ మారియా రిల్కే, బొహీమియన్-ఆస్ట్రియన్ కవి

సంగీతం: శిల్పాల ఊపిరి. బహుశా

చిత్రాల మౌనం. భాష ఏదైనా దాని శబ్దసర్వస్వమంతా

ఆ పొలిమేర దాటలేదు. ఓహ్!

మర్త్యహృదయాల స్పందనలపై కాలం నిలుకడ.

సంగీతమా! ఈ అనుభూతులెవరికోసమని? ఈ అనుభూతుల్ని

ఎలా పరివర్తిద్దామని? … శ్రవణదృశ్యాలుగా రూపుదిద్దడానికా?

ఓ అపరిచిత సంగీతమా… నీ హృదయాంతరం

మా ఆత్మ జనితం. మా అంతరాంతర కుహరసీమ

ఛేదించుకుని, త్రోవచేసుకు బయటపడి మమల్ని ముంచెత్తుతుంది.

మా అంతరంతరాలలోని తావు

ఎదురుగా సాక్షాత్కరించడం,

ఎంత పవిత్రమైన ప్రస్థానం!

చేజాపుదూరంలో, గాలికి అవతలి ఒడ్దులా

నిర్మలంగా

అంతులేకుండా

బ్రతకనీకుండా…

.

రైనర్ మారియా రిల్కే

(4 December 1875 – 29 December 1926)

బొహీమియన్-ఆస్ట్రియన్ కవి

.

.

To Music

.

Music: breathing of statues. Perhaps:
silence of paintings. You language where all language
ends. You time
standing vertically on the motion of mortal hearts.

Feelings for whom? O you the transformation
of feelings into what?–: into audible landscape.
You stranger: music. You heart-space
grown out of us. The deepest space in us,
which, rising above us, forces its way out,–
holy departure:
when the innermost point in us stands
outside, as the most practiced distance, as the other
side of the air:
pure,
boundless,
no longer habitable.

.

Rainer Maria Rilke

(4 December 1875 – 29 December 1926)

Bohemian-Austrian Poet

Poem Courtesy: https://www.poemhunter.com/poem/to-music/ 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: