జీవిత చరమాంకంలోకి వచ్చిన వాళ్ళకి మిగిలేది తమజీవితం గురించిన పునశ్చరణ, మూల్యాంకనం చేసుకోవడమూను. ఎక్కువ శాతం అందులో సంతృప్తికంటే అసంతృప్తే ఉంటుంది. అందుకే (వ్యక్తిగత ప్రమాణాలననుసరించి) ఎవరికి వారు జీవితంలో సఫలత సాధించిన వారి గురించి వినడానికి ఇష్టపడతారు. ఇక్కడ “నిశ” చీకటి గాని రాత్రి గాని కాదు. మృత్యువు; మదిర … అమృతసేవనానికి అర్రులుజాచడం. ఎవరు ఎన్ని సాధించినా సాధించకపోయినా, లేక సాధించామనో సాధించలేకపోయామనో అనుకున్నా, వాళ్ళగురించి ఏదీ మిగలదు. వాళ్ళు పోగొట్టుకున్నదీ లేదు. మిగిల్చిపోయిందీ లేదు. కేవలం ఆత్మసంతృప్తి మినహా. శ్రీశ్రీ అన్నట్టు,
“ఇక్కడికి ఎందుకొచ్చామో,
ఇక్కడ ఎన్నాళ్ళుంటామో
…
ఎవరూ
చెప్పలేరంటే నమ్ము.
చెబితేమాత్రం, నమ్మకు.”
ఈ కవిత పరోక్షంగా చెబుతున్న సందేశం ఇదేనని నాకు అనిపిస్తోంది.
***
మంచిపాటకోసం వాచిపోయిన చెవులకి
గొప్ప సంగీతం వినబడితే, మనసుని ఎటో లాక్కుపోతుంది.
మనం గుడ్డిగా దాని వెంటబడతాం,
తుంపరలై కురిసినా, జల్లై తడిపినా,
ఎన్నడూ ఎరుగని లోకాలకి అనుసరిస్తాం.
ఓ నిశాదేవీ! మమ్మల్ని తేలిపోనీ.
సాగరతరంగాలనుండి వచ్చే పవనమా! గర్జించు!
ఆ సముద్రాన్ని ప్రశ్నించు
పోగొట్టుకున్న దేది, మిగిలినదేది? అని.
ఏ కొమ్ము మునిగిందో,
ఏ కిరీటం ఒడ్డుజేరిందో.
మనం ఉన్నచోట ఎవరికి తెలుసు
ఏ రాజులు చీకటిపడగానే
మదిరకై చెయ్యిజాచుతారో?
ఎవరు పరశువు ఊచుతూ
రాజుల కుత్తుకలుత్తరిస్తారో?
మనం ఎక్కడికిపోతామో చెప్పగలరో?
.
బాసిల్ బంటింగ్
1 March 1900 – 17 April 1985
బ్రిటిషు కవి
.
Basil_Bunting_
c1980s_photo_by_Jonathan_Williams.jpg
Courtesy: Wikipedia
.
Coda
.
A strong song tows
us, long earsick.
Blind, we follow
rain slant, spray flick
to fields we do not know.
Night, float us.
Offshore wind, shout,
ask the sea
what’s lost, what’s left,
what horn sunk,
what crown adrift.
Where we are who knows
of kings who sup
while day fails? Who,
swinging his axe
to fall kings, guesses
where we go?
.
Basil Bunting
1 March 1900 – 17 April 1985
British Modernist PoetA
Poem Courtesy: https://www.poetryfoundation.org/poems/47708/coda-56d2285ab4d58
స్పందించండి