మరో ట్రాయ్ ఎక్కడుంది? … విలియం బట్లర్ యేట్స్, ఐరిష్ కవి

Maud Gonne

Picture Courtesy: Wikipedia

ఇది యేట్స్ తన ప్రియురాలు, ఐరిష్ నటి, విప్లవకారిణి Maud Gonne మీద వ్రాసిన కవిత. ఇక్కడ ఒక చారిత్రక సత్యాన్ని తీసుకుని (హెలెన్ కోసం ట్రాయ్ పట్టణం దహించబడడం), ఒక విలక్షణమైన ప్రతిపాదన చేస్తున్నాడు: అందం నిప్పులాంటిది. అది ఇతరులనైనా దహిస్తుంది. తనని తానైనా దహించుకుంటుంది. “యేట్స్ ప్రేయసి Maud Gonne కోసం ఇప్పుడెవరూ యుద్ధం చెయ్యడం లేదు గనుక (ఇది అతని ఊహ మాత్రమే), ఆమె తన లక్ష్యంకోసం తనని తాను దహించుకుంటోంది” అని అతని భావం .

.

నా జీవితాన్ని దుఃఖభాజనము చేసిందని ఆమెని ఎందుకు నిందించాలి,

ఈమధ్య ఏమీ ఎరుగని అమాయకులైన యువకులకు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లో గొడవలుచేసేవాళ్లలా కాకుండా

అత్యంతహింసాత్మకమైన మార్గాలను బోధిస్తోందని ఎందుకు అనాలి …

వాళ్ళకి కోరికున్నంత గాఢంగా ధైర్యంకూడా ఉన్నప్పుడు?

సారించడానికి సిద్ధంగా ఉన్న నారి లాంటి ఆమె అందమూ,

ఈ రోజుల్లో అటువంటిది అంత సహజమైన విషయం కాదు,

రాజీలేని తీవ్రత, ఏకాగ్రత, తిరుగులేని నిశ్చయమూ,

ఉదాత్తమైన వ్యక్తిత్వం నిప్పంత నిర్మలంగా ఉంచిన

ఆమె మనసుకి, ఏది ప్రశాంతతని అందివ్వగలదు?

ఏమీ, ఆమె ఆమె అయిన తర్వాత, అంతకంటే ఏం చేస్తుంది?

తగలబెట్టడానికి మరో ట్రాయ్ ఎక్కడుంది?
.

విలియం బట్లర్ యేట్స్

(13 June 1865 – 28 January 1939)

ఐరిష్ కవి.

.

Why should I blame her that she filled my days

With misery, or that she would of late

Have taught to ignorant men most violent ways,

Or hurled the little streets upon the great,

Had they but courage equal to desire?

What could have made her peaceful with a mind

That nobleness made simple as a fire,

With beauty like a tightened bow, a kind

That is not natural in an age like this,

Being high and solitary and most stern?

Why, what could she have done, being what she is?

Was there another Troy for her to burn?

.

WB Yeats  

(13 June 1865 – 28 January 1939)

Irish Poet

(The Poem was  published in 1921 in the collection Green Helmet and Other Poems.)

Poem Courtesy: https://www.poetryfoundation.org/poems/49772/no-second-troy

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: