సహజమైన ఆశ… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి నశ్వరమైన ఈ మట్టికి ఎక్కడైనా మరో ప్రపంచం ఉందా, ప్రాణంపోసుకుని వెచ్చగా వెనకటిలా ఉండడానికి? నా చుట్టూ ఉన్న దేదో అటువంటి అవకాశం ఉన్నాదని చెబుతోంది. లేకుంటే నిష్కారణంగా ఎందుకు మన స్వభావం అటువంటి ఆశలు కల్పించుకుంటుంది? అటువంటి అవకాశం ఉంటుందన్నది ఈ ప్రకృతి భవిష్యవాణి కూడా. అందుకే అంతభద్రంగా దాచిన మహోన్నతమైన రహస్యాన్ని విప్పిచెప్పడానికి ప్రతీదీ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోంది. శాశ్వతత్వం మీద ఎంతోఆశ ఉండబట్టే, కాలంకూడా అంత ధీమాగా ముందుకి నడుస్తోంది ఆ ప్రశాంతస్థితినందుకుని విశ్రాంతి స్థలం చేరుకుందికి. అంత చిన్ని నీలలోహిత కుసుమానికికూడా భవిష్యత్తుపై అంత నియంత్రణ ప్రతి ఏడూ తనఋతువులో సరికొత్తగా పువ్వులు పూయడానికి; మనిషి ఆ పువ్వుకంటే తక్కువ ఏమి తిన్నాడు, మరో వసంతానికి నోచుకోకుండా వృధాగా మరణించడానికి? . జాన్ క్లేర్ 13 July 1793 – 20 May 1864) ఇంగ్లీషు కవి . . The Instinct of Hope Is there another world for this frail dust To warm with life and be itself again? Something about me daily speaks there must, And why should instinct nourish hopes in vain? ‘Tis nature’s prophesy that such will be, And everything seems struggling to explain The close sealed volume of its mystery. Time wandering onward keeps its usual pace As seeming anxious of eternity, To meet that calm and find a resting place. E’en the small violet feels a future power And waits each year renewing blooms to bring, And surely man is no inferior flower To die unworthy of a second spring? . John Clare (13 July 1793 – 20 May 1864) English Poet Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే ఏప్రిల్ 10, 2019
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు18th centuryEnglish PoetJohn Clare గీతిక 314… రూమీ పెర్షియన్ కవిWhat the Thunder Had said… Vadrevu Chinaveerabhadrudu, Indian Poet స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.