రోజు: ఏప్రిల్ 9, 2019
-
గీతిక 314… రూమీ పెర్షియన్ కవి
ప్రేమ తమని నదిలా తనలోకి ఈడ్చుకుపోతున్నట్టు ఎవరు అనుభూతిచెందలేరో, ఎవరు ప్రాభాతాన్ని చెలమనీటిని దోసిలితో తాగినట్టు గ్రోలలేరో, లేక, సూర్యాస్తమయాన్ని రాత్రిభోజనంలా ఆరగించలేరో, ఎవరు మారడానికి అయిష్టంగా ఉంటారో, వాళ్ళని అలా నిద్రపోనీయండి. ఈ ప్రేమ వేదాంత చర్చ పరిధికీ, ఒకప్పటి మాయమాటలకీ, ఆత్మవంచనలకీ అతీతమైనది. మీరు మీ మనసుని ఆ విధంగా మెరుగుపరచుకోదలిస్తే అలాగే కానీండి. నిద్రపోండి. నేను నా బుద్ధిని పక్కనబెట్టాను. నా తొడుగులను విడిచి పీలికలు పీలికలుగా చేసి పారవేశాను. మీరు ఏ…