సమస్య… ఆల్ఫ్రెడో గోమేజ్ జైమ్, కొలంబియన్ కవి

నేను మృత్యువంటే భయపడే పిరికివాడిని.

నేను జీవితమన్నా భయపడే పిరికివాడిని:

మృత్యువూ- జీవితమూ: రెండూ బృహద్రహస్యాలు .

జీవితం- మృత్యువూ: రెండూ గొప్ప మోసగత్తెలు.

.

గులాబిమాలలతో అలంకరింపబడి – జీవితం సాగిపోతుంది;

బరువైన ముసుగుకప్పుకుని- దరిజేరుతుంది మృత్యువు;

దాని ప్రయాణంవేగంలో జీవితాన్ని ఎవరూ నిరోధించలేరు.

అది రాకుండా మృత్యువుని ఎవ్వరూ అడ్డగించనూ లేరు.

.

నేనొక పిసినారిని, చెంగటనున్న సంపద కాపుకాస్తుంటాను

నేను ఆరాధించే- మనసుకి నచ్చిన అపురూప సంపదను.

ఎంతో ఇష్టమైనవని పువ్వుల్ని అతిజాగ్రత్తగా సంరక్షించుకుంటాను.

ఆ కారణంగానే, వాటిని పోగొట్టుకుందికి ఇష్టపడను.

“ఆగు!” అంటూ జీవితాన్ని బాధలోకూడా వేడుకుంటాను,

భయంతో వణుకుతూ, “వెనక్కి పో!” అని మృత్యువుపై అరుస్తాను.

.

ఆల్ఫ్రెడ్ గోమేజ్ జైమ్

(2nd June 1878  – 21st Aug 1946) 

కొలంబియన్ కవి

.

Problem

.

I am a coward fearful of Death,

I am a coward fearful of Life:

They are two vast secrets, Life and Death;

Two great traitors are they, Death and Life.

Garlanded in roses, passes Life;

With a heavy pall, approaches Death;

And none in her flight can detain Life,

And none in her coming can detain Death.

I am a miser, on guard his treasure before,

The heart’s precious treasure- those whom I adore.

I tend my flowers mourning that they are dear.

I would not lose them! – for this reason  

“Wait!” unto Life in my agony cry;

And “Back!” shriek to Death, shivering with fear.
.

Alfredo Gomez Jaime

(2nd June 1878  – 21st Aug 1946) 

Columbian Writer and Public Official

Poem Courtesy: https://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=26&issue=3&page=13

Read Bio here or  here

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: