మంచులో వేటగాళ్ళు… విలియం కార్లోస్ విలియమ్స్, అమెరికను కవి
This Poem is about this picture by Piter Brugel the elder (1525- 9th Sept 1569), the famous and most significant artist of Dutch and Flemish Renaissance Painting. The Painting is “Hunter In the Snow” … is an Oil on canvas, 46 inches x 63.75 inches displayed in Kunsthistorisches Museum, Vienna.
***
ఆ చిత్రం
శీతకాలంలో మంచుకొండలు.
నేపథ్యంలో వేటనుండి
తిరిగివస్తున్న ఆటగాళ్ళు. అది సాయంత్రవేళ.
ఎడమవైపునుండి ముందుకు నడుస్తూ బలిష్టులైన వేటగాళ్ళు
వాళ్ళని అనుసరిస్తూ వేటకుక్కలు.
విరగకుండా మిగిలిన రెండో కొక్కానికి
వసతిగృహం అన్న బోర్డు
దుప్పికొమ్ముకి శిలువలా వేలాడుతోంది.
అక్కడ మండుతున్న నెగడు మినహాయిస్తే
కొమ్ములమధ్యనుండీ కనిపిస్తున్న
ఆ వసతిగృహపు ముందు ఆవరణ నిర్మానుష్యంగా ఉంది.
ఆ నెగడుచుట్టూ స్త్రీలు
గుమిగూడి దాన్ని ఎగదోస్తుంటే
గాలివాటానికి అది ఎగసిపడుతోంది.
చిత్రానికి కుడిగా దూరంగా
కొండలు మంచుమీదజారుడుబండ
ఆడే ఆటగాళ్ళకి అనువుగా పరుచుకున్నట్టు ఉన్నాయి.
చిత్రానికి క్రిందిభాగంలో
మంచుతడిసిన పొద
చిత్రకారుడు పీటర్ బ్రూషెల్ దాన్ని ముగించాడు.
.
విలియం కార్లోస్ విలియమ్స్,
(September 17, 1883 – March 4, 1963)
అమెరికను కవి .
.
The Hunter in the Snow
.
The over-all picture is winter
icy mountains
in the background the return
from the hunt it is toward evening
from the left
sturdy hunters lead in
their pack the inn-sign
hanging from a
broken hinge is a stag a crucifix
between his antlers the cold
inn yard is
deserted but for a huge bonfire
that flares wind-driven tended by
women who cluster
about it to the right beyond
the hill is a pattern of skaters
Brueghel the painter
concerned with it all has chosen
a winter-struck bush for his
foreground to
complete the picture
.
William Carlos Williams
(September 17, 1883 – March 4, 1963)
American Poet
The Painter… Bolloju Baba, Telugu Poet, Indian
Once
His signature on walls,
Banners, signboards and cut-outs
Used to gleam like
The solar disc hanging on to the horizon.
Between the straight lines
He drew with the twine dipped in indigo
His letters used to nestle like doves in a nest.
The paints amid the squirrel hairs of the brush
Marched with the discipline of soldiers.
Producing derived colours from the basic
Was an esoteric skill… known only to him.
It was common those days
While cleaning the premises each day,
To find a few pairs of eyes and hearts
Of anonymous admirers lost in front of his paintings.
For beginners, his letters
Used to show the way clearly, but silently.
Oh! His wooden box overflowed color cans!
It seemed he slivered rainbow vertically
And stuffed each color with its shades in those cans.
There were any number of brushes in that Box
From the hair-thin line to sky-wide line.
The stains of colours
That appear so liberally
On his bald-head, his hands and skin
Seemed to confer
A kind of divinity to him.
But, today
The vinyl prints, the Flexi banners,
The Photo-shops and the Corel-Draws
Like winter seizing from all sides
Have invaded him
And his livelihood melted like a shattered dream.
An undiluted darkness
Suddenly spilt all over his life’s canvas.
From now on, with nothing else to do
He would encounter us on the road some day
Doing a sketch of Christ or a drawing of Saibaba .
.
Bolloju Baba
Telugu Poet, Indian

పెయింటరు
ఒకప్పుడు
గోడలు, బేనర్లు, సైను బోర్డులూ
కటౌట్లపై వాడి సంతకం
ఆకాశం అంచున వేలాడే సూర్యబింబంలా
వెలిగిపోతుండేది.
నీలిమందు నీళ్ళలో ముంచిన పురికొస సాయంతో
వాడు గీసిన సరళరేఖలమధ్య అక్షరాలు
గూటిలోని గువ్వల్లా ఒదిగిపోయేవి.
కుంచెలోని ఉడుతవెంట్రుకల మధ్య వర్ణాలు
సురక్షిత సైనిక కవాతులా కదిలేవి.
బేసిక్ కలర్స్ నుండి డిరైవ్డ్ రంగుల్ని
సృష్టించడం వాడికి మాత్రమే తెలిసిన ఓ రసవిద్య.
అతడు గీసిన చిత్రాలముందు
ఎవరెవరోపారేసుకున్న
ఓ పది పన్నెండు కళ్ళూ, రెండు మూడు హృదయాలూ
ప్రతిరోజూ తుడుపులో దొరుకుతుండేవి.
కొత్తవారికి వాడి రాతలు
నిశ్శబ్దంగా, నిర్దుష్టంగా దారిచూపేవి.
వాడి చెక్కపెట్టినిండా రంగురంగుల డబ్బాలే!
ఇంద్రధనుస్సుని నిలువునా చీరి
ఒక్కో ముక్కనీ ఒక్కో దబ్బాలో వేసుకున్నాడా అనిపించేది.
పెట్టెలో వివిధ సైజుల్లో బ్రష్షులు ఉండేవి
సన్నని గీతనుండి ఆకాశమంత పెద్దరేఖ వరకూ.
గీయటానికై
వాడి బట్టతలపై, వంటిపై, హృదయంపై
చిలికిన రంగుల మరకలు
వాడికో దివ్యత్వాన్నిస్తున్నట్లు
మురిసిపోయేవి.
కానీ ఇప్పుడు
వినైల్ ప్రింట్లూ, ఫ్లెక్సీ బేనర్లూ
ఫోటో షాపులూ, కొరెల్ డ్రాలూ,
అన్నివైపులనుండీ కమ్ముకునే
శీతవేళలా వాడిని మింగేశాయి.
వాడి ఉపాధి స్వప్నంలా జారిపోయింది.
వాడి జీవితంలోకి
థిన్నర్ కలుపని చిక్కని నల్లని రంగు ఎగజిమ్మింది.
ఎప్పుడో ఎక్కడో వాడు
రోడ్డుపై క్రీస్తులానో, సాయిబాబాలానో
కళాత్మకంగా మనదారికడ్డంపడతాడు
ఇంకే చెయ్యాలో తెలియక!
.
(పెయింటర్ మిత్రుడు కీ. శే. పట్నాల రమణ ప్రసాద్ కు
వెబ్ పత్రిక తెలుగుజ్యోతి సెప్టెంబరు-అక్టోబరు 2008)
బొల్లోజు బాబా
ఆకుపచ్చని తడిగీతం నుండి
కాలిపోతున్న ఓడ… జాన్ డన్ ఇంగ్లీషు కవి.
.
ఇది చాలా సందేశాత్మకమైన కవిత. మనం జీవితాలు కాలి మునిగిపోతున్న ఓడలాంటివి. మరణాన్నించి ఎవ్వరమూ తప్పించుకోలేం. అలా తప్పించుకుందికి ప్రయత్నంచేసిన వారికి మరణకారణం మారుతుందేమో గాని మరణాన్నుంచి మినహాయింపు మాత్రం దొరకదు. జాన్ డన్ 17 వ శతాబ్దపు ప్రముఖ ఆధిభౌతిక (Metaphysical) కవుల పరంపరకి చెందినవాడు.
.
సముద్రంలో మునిగిపోవడంవల్ల తప్ప మంటలనుండి
తప్పించుకోలేని కాలిపోతున్న ఓడ లోంచి
కొందరు మనుషులు ఒక్కసారి బయటకు గెంతారు ,
వాళ్ళు శత్రుఓడలదరికి జేరగానే వాళ్ళతూటాలకు బలైపోయారు;
అలా ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ సమసిపోయారు,
చిత్రంగా, సముద్రంలో దూకినవారు నిప్పుకీ,
మండుతున్న ఓడలో మిగిలినవారు నీటమునిగీ.
.
జాన్ డన్
(22 January 1572 – 31 March 1631)
ఇంగ్లీషు కవి.
.
Burnt Ship
.
Out of a fired ship, which by no way
But drowning could be rescued from the flame,
Some men leap’d forth, and ever as they came
Near the foes’ ships, did by their shot decay;
So all were lost, which in the ship were found,
They in the sea being burnt, they in the burnt ship drown’d.
.
John Donne
(22 January 1572 – 31 March 1631)
English Poet
Poem Courtesy: https://www.poetryfoundation.org/poems/44095/a-burnt-ship

సమస్య… ఆల్ఫ్రెడో గోమేజ్ జైమ్, కొలంబియన్ కవి
నేను మృత్యువంటే భయపడే పిరికివాడిని.
నేను జీవితమన్నా భయపడే పిరికివాడిని:
మృత్యువూ- జీవితమూ: రెండూ బృహద్రహస్యాలు .
జీవితం- మృత్యువూ: రెండూ గొప్ప మోసగత్తెలు.
.
గులాబిమాలలతో అలంకరింపబడి – జీవితం సాగిపోతుంది;
బరువైన ముసుగుకప్పుకుని- దరిజేరుతుంది మృత్యువు;
దాని ప్రయాణంవేగంలో జీవితాన్ని ఎవరూ నిరోధించలేరు.
అది రాకుండా మృత్యువుని ఎవ్వరూ అడ్డగించనూ లేరు.
.
నేనొక పిసినారిని, చెంగటనున్న సంపద కాపుకాస్తుంటాను
నేను ఆరాధించే- మనసుకి నచ్చిన అపురూప సంపదను.
ఎంతో ఇష్టమైనవని పువ్వుల్ని అతిజాగ్రత్తగా సంరక్షించుకుంటాను.
ఆ కారణంగానే, వాటిని పోగొట్టుకుందికి ఇష్టపడను.
“ఆగు!” అంటూ జీవితాన్ని బాధలోకూడా వేడుకుంటాను,
భయంతో వణుకుతూ, “వెనక్కి పో!” అని మృత్యువుపై అరుస్తాను.
.
ఆల్ఫ్రెడ్ గోమేజ్ జైమ్
(2nd June 1878 – 21st Aug 1946)
కొలంబియన్ కవి
.
Problem
.
I am a coward fearful of Death,
I am a coward fearful of Life:
They are two vast secrets, Life and Death;
Two great traitors are they, Death and Life.
Garlanded in roses, passes Life;
With a heavy pall, approaches Death;
And none in her flight can detain Life,
And none in her coming can detain Death.
I am a miser, on guard his treasure before,
The heart’s precious treasure- those whom I adore.
I tend my flowers mourning that they are dear.
I would not lose them! – for this reason
“Wait!” unto Life in my agony cry;
And “Back!” shriek to Death, shivering with fear.
.
Alfredo Gomez Jaime
(2nd June 1878 – 21st Aug 1946)
Columbian Writer and Public Official
Poem Courtesy: https://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=26&issue=3&page=13
Read Bio here or here
స్నేహితులు మూడు రకాలు…. రూమీ, పెర్షియన్ కవి
నే చెపుతున్నా, వినుకో: స్నేహితులు మూడు రకాలు
మనని వాడుకునే వాళ్ళు, స్నేహం నటించేవాళ్ళు, నిజమైన స్నేహితులూ.
.
ఎదో కొంత విదిల్చి, నిన్ను వాడుకునే వాడిని వదిలించుకో
తియ్యగా మాటాడుతూనే, నటించేవాడు నిన్ను మోసగించకుండా చూసుకో.
.
కానీ, నిజమైన స్నేహితుడిని మనసులో పదిలపరుచుకో
కష్టపడవలసి వచ్చినా, భరించు. కానీ, అతన్ని చెయ్యిజారనియ్యకు.
.
రూమీ
(30 సెప్టెంబరు 1207 – 17 డిసెంబరు 1273)
పెర్షియన్ సూఫీ కవి
.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi