చిత్రం… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి ఊపిరి తీయనివీ, కంటి చూపు లేనివీ, వాటికే మరణం లేకపోవడం ఏమిటి?! చైతన్యం ఎరుగని ఒక బండరాయికీ, పిసరంత నేలకీ శాశ్వతత్వం అనుగ్రహించబడటం ఏమిటి?! ఒక ధూళికణం, ఒక మట్టి బెడ్డ భగవంతుడి అపురూపమైన వరానికి నోచుకుంటాయి. దారి పక్కన పడుండే గులకరాయికి చావు లేదు. మన తాత ముత్తాతలు కోసిన గడ్డి పరకలు ఇప్పుడు వాళ్ళ సమాధులమీద మొలుస్తున్నాయి. కనీ కనిపించకుండా ప్రవహించే పిల్లకాలువలు అనవరతంగా ప్రవహిస్తూ ఎండిపోతుంటాయి. పేలవంగా, నిశ్చలంగా పడి ఉండే ఇసకరేణువులకి ఎటువంటి మరణమూ లేదు. మనిషి బలవంతుడూ, తెలివైనవాడూ, గొప్పవాడూ కనుకనే అతనికి మరణం. . లూయీ అంటర్ మేయర్ (October 1, 1885 – December 18, 1977) అమెరికను కవి . . Irony Why are the things that have no death The ones with neither sight nor breath! Eternity is thrust upon A bit of earth, a senseless stone. ……………… ……………… Left blank for copyright reasons ……………………. The grass our fathers cut away Is growing on their graves to-day; The tiniest brooks that scarcely flow Eternally will come and go. ………………………… Left blank for copyright reasons ………………………….. But Man is great and strong and wise— And so he dies. . Louis Untermeyer (October 1, 1885 – December 18, 1977) American Poet, Critic and editor Poem Courtesy: https://allpoetry.com/poems/read_by/Louis%20Untermeyer?page=1 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే ఫిబ్రవరి 22, 2019
వర్గాలుఅనువాదాలు కవితలు కేవలం ఒక సామాన్య సైనికుడు … లారెన్స్ వెయిన్ కోర్ట్, కెనేడియన్ కవిSri Visakhapatnam Kanaka Mahalaksmi… Munipalle Raju, Telugu, Indian స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.