బట్టలారవేసిన తీగ … కుటుంబంలో
ప్రేమకీ, సేవకీ ఒక రుద్రాక్షమాల వంటిది;
తల్లి ప్రేమించే ప్రతి చిన్న దేవదూత
దుస్తులూ అక్కడ మనకి దర్శనం ఇస్తాయి.
ఆమె పెరటిలో ఆలోచనలలో మునిగి
దండెం మీద ఒక్కొక్కబట్టా ఆరవేస్తున్నప్పుడు
ప్రతి బట్టనీ ఒక రుద్రాక్షపూసగా
పరిగణిస్తుందంటే ఆశ్చర్యపోనక్కరలేదు.
అపరిచితవ్యక్తినైన నేను అటువైపుగా పోతూ
ఆ ఇంటికీ, దుస్తులకీ ఒక అంజలి ఘటిస్తాను
ప్రేమపూర్వకమైన శ్రమకీ, ప్రార్థనకీ గల దగ్గరపోలిక
మదిలో మెదలినపుడు పెదాలపై చిరునవ్వు మెరుస్తుంది.
.
జూలియా వార్డ్ హోవ్
(27 May 1819 – 17 October 1910)
అమెరికను కవయిత్రి
స్పందించండి