నిన్న రాత్రి, అలా ఆలోచిస్తూ విశ్రమిస్తుంటే,
కొన్ని ‘ఎలా?” అన్న భయాలు నా చెవిలో దూరి
రాత్రల్లా గెంతులేస్తూ, పండగ చేసుకుంటూ
వాటి పాత పల్లవి “ఎలా? ఎలా?” ని అందుకున్నాయి:
స్కూలో నేను సరిగా మాటాడలేకపోతే ఎలా?
వాళ్ళు ఈత కొలను మూసెస్తే ఎలా?
ఒకవేళ ఎవరైనా నన్ను చితక్కొట్టెస్తే ఎలా?
నా కప్పులో ఎవరైనా విషం కలిపితే ఎలా?
ఒకవేళ నేను ఏడవడం మొదలెడితే ఎలా?
ఒకవేళ నాకు రోగం వచ్చి చచ్చిపోతే ఎలా?
నేను ఆ పరీక్షలో తప్పితే ఎలా?
నా ఛాతీమీద ఆకుపచ్చ రోమాలు మొలిస్తే ఎలా?
నేనంటే ఎవరికీ ఇష్టం లేకపొతే ఎలా?
మెరుపు మెరిసి నామీద పిడుగుపడితే ఎలా?
నేను ఎదగకుండా మరుగుజ్జుగా ఉండిపోతే ఎలా?
నా తల రోజురోజుకీ కుంచించుకుపోతే ఎలా?
నా గాలానికి చేప చిక్కకపోతే ఎలా?
సుడిగాలి నా గాలిపటాన్ని చింపిపోగుపెడితే ఎలా?
ఒకవేళ వాళ్ళే యుద్ధం మొదలెడితే ఎలా?
ఒకవేళ అమ్మా నాన్నా విడిపోతే ఎలా?
బస్సు ఒకవేళ ఆలస్యంగా వస్తే ఎలా?
నా దంతాలు తిన్నగా మొలవకపొతే ఎలా?
పొరపాటున నేను నా పంట్లాం చించేసుకుంటే ఎలా?
జీవితంలో నేను ఎన్నడూ నాట్యం నేర్చుకోలేకపోతే ఎలా?
అన్నీ సవ్యంగానే ఉన్నాయి. అంతా బాగానే ఉంది.
కానీ చీకటిపడితే చాలు, “ఎలా?” అన్న భయాలు తలెత్తుతుంటాయి.
.
షెల్ సిల్వర్ స్టీన్
(September 25, 1930 – May 10, 1999)
అమెరికను కవి
.
Shel Silverstein
(Sheldan Allan Silverstein)
(September 25, 1930 – May 10, 1999)
Image Courtesy: Wikipedia
.
What-if?
.
Last night, while I lay thinking here,
some What-ifs crawled inside my ear
and pranced and partied all night long
and sang their same old What-if song:
What-if I’m dumb in school?
What-if they’ve closed the swimming pool?
What-if I get beat up?
What-if there’s poison in my cup?
What-if I start to cry?
What-if I get sick and die?
What-if I flunk that test?
What-if green hair grows on my chest?
What-if nobody likes me?
…..
….
….
…
…
… (Deliberately left blank for copyright reasons)
…
….
….
….
….
….
స్పందించండి