నాకు నక్షత్రగతులు తెలుసు, కానీ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి నాకు పేరు పేరునా నక్షత్రాలు తెలుసు ఆల్డెబరాన్ (రోహిణి), ఆల్టేర్ (శ్రవణం) … విశాలమైన నీలాకాశపు నెచ్చెన అవి ఎలా ఎక్కుతాయో కూడా తెలుసును. వాళ్ళు చూసే చూపులనుబట్టి మగవాళ్ళ రహస్యాలు పసిగట్టగలను వారి వింత వింత, చీకటి ఆలోచనలు బాధకలిగించడంతో పాటు జాగ్రత్తనీ బోధించాయి. కానీ నీ కళ్ళే నా ఊహకి అందటం లేదు, అవి పదే పదే పిలుస్తున్నట్టు అనిపిస్తున్నా… నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో తెలీదు అలాగని, అసలు ప్రేమించటం లేదనీ చెప్పలేను. నాకు చాలా విషయాలు తెలుసును. ఏం లాభం? సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి, చివరకి నేను తెలుసుకుందామని ఉబలాటపడేది బహుశా తెలుసుకోకుండానే మరణిస్తాను. . సారా టీజ్డేల్ (8 August 1884 – 29 January 1933) అమెరికను కవయిత్రి Sara Teasdale (August 8, 1884 – January 29, 1933) . I Know the stars . I know the stars by their names Aldebaran, Altair And I know the path they take Up the heaven’s broad blue stair I know the secrets of men By the look of their eyes Their gray thoughts, their strange thoughts Have made me sad and wise. But your eyes are dark to me Though they seem to call and call— I cannot tell if you love me Or do not love me at all. I know many things, But years come and go, I shall die not knowing The thing I long to know. . Sara Teasdale (8 August 1884 – 29 January 1933) American Lyrical Poet Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే ఫిబ్రవరి 14, 2019
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు(8 August 1884 – 29 January 1933)AmericanLyrical PoetSara TeasdaleWoman వివేచనల కావల… జలాలుద్దీన్ రూమీ, పెర్షియన్ కవికాలం… హెన్రీ వాన్ డైక్, అమెరికను స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.