నా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, అవిచ్ఛిన్నమైన
వెలుగుపుంజమొకటి కాలక్రమంలోనన్నావహించింది,
అది సమస్త వస్తువుల్నీ విశ్లేషించి విశ్లేషించి కడకు, నా ముందు
వర్ణ,రూపరహితమైన వస్తువుగా నిలబెట్టేది,కేవల భావనగా.
జనప్రవాహంతో పొరలిప్రవహించే మౌలికమైన దివారాత్రాలు కూడా
ప్రాభాతసమయాన అరుణోదయానికి ఎదురుచూస్తూ
చిక్కగా, స్థిరంగా, నిలకడగా కనిపించే ఉషః కాంతిలా
మారిపోయేవి. నాకు ఒక్కటంటే ఒక్కటైనా మనిషిముఖం
చూడగలిగితేబాగుణ్ణనిపించేది. నాకు తెలియకుండానే,
చేత్తోపట్టుకోడం తప్ప మరేమీచెయ్యలేని ఆ మూసిన విజ్ఞానసర్వస్వ
సంపుటాలలోంచి చిన్నచిన్న పక్షులూ, వెన్నెల చందమామలూ ఎగిరిపోయేవి.
మంచికో చెడుకో, తక్కినవాళ్ళందరికీ ఈ ప్రపంచం దక్కితే దక్కనీ
నాకు మాత్రం ఈ మసకవెలుతురూ, కవిత్వప్రయాసలూ చాలు.
.
జార్జ్ లూయీ బోర్హెస్
(24th Aug 1899 – 14th June 1986)
అర్జెంటీనా కవి
.
Jorge Luis Borges
Argentine Poet
స్పందించండి