ఓ పిల్లవాడా! గెలుపు కేకలు వేసుకుంటూ,
జీవన రణరంగంలోకి నీ పాదాలను మోపావు
ఏ తగవులూ లేనిచోటునుండి… పోరాటస్థలికి
ఏ సంశయాలూ లేనిచోటునుండి …సందేహాలలోకి.
యవ్వనమనే పేలవమైన కవచాన్ని తొడుక్కుని
కుర్రవాడా! లెక్కలేనన్ని యుద్ధాలలో పాల్గొనాలి,
ప్రేమబావుటా ఎగరేసి లోకాల్ని గెలవాలంటే,
నిరసనగళమనే కరవాలమూ, సత్యమనే డాలూ తోడుండాలి.
లోకంలోని నిరాశానిస్పృహలు నీచుట్టూ ఎగసిపడుతుంటాయి;
అపజయాలకి నువ్వు లోనై, దారికోసం తడుముకుంటావు.
నీ ఆవేశం, అవలక్షణమని నిను నిందించేస్థాయిలో ఉండాలి
నిరాశాజనకమైన భవిష్యత్తుకి, నువ్వు ఆశల ఊపిరులూదాలి.
చీకటిలోమునిగిన ప్రపంచానికి నువ్వొక వెలుగుదివ్వె కావాలి,
దాని నిర్లిప్తతని నువ్వు చావుదెబ్బకొట్టాలి—
ఎందుకంటే, దాని బాధలూ, సంక్షోభాల్లోంచే నువ్వు పుట్టింది
దాని బాధలూ, సంక్షోభాలలోకే నువ్వు తిరిగి నిష్క్రమించేది.
.
లూయీ అంటర్ మేయర్
(October 1, 1885 – December 18, 1977)
అమెరికను కవి
.
On The Birth Of A Child
.
LO, to the battle-ground of Life,
Child, you have come, like a conquering shout,
Out of a struggle—into strife;
Out of a darkness—into doubt.
Girt with the fragile armor of youth,
Child, you must ride into endless wars,
With the sword of protest, the buckler of truth,
And a banner of love to sweep the stars.
About you the world’s despair will surge;
Into defeat you must plunge and grope.
Be to the faltering an urge;
Be to the hopeless years a hope!
Be to the darkened world a flame;
Be to its unconcern a blow—
For out of its pain and tumult you came,
And into its tumult and pain you go.
.
Louis Untermeyer
(October 1, 1885 – December 18, 1977)
American
Poem Courtesy:
https://allpoetry.com/Louis-Untermeyer
స్పందించండి