రోజు: జనవరి 31, 2019
-
బిడ్డ పుట్టినపుడు … లూయీ అంటర్ మేయర్, అమెరికనుకవి
ఓ పిల్లవాడా! గెలుపు కేకలు వేసుకుంటూ, జీవన రణరంగంలోకి నీ పాదాలను మోపావు ఏ తగవులూ లేనిచోటునుండి… పోరాటస్థలికి ఏ సంశయాలూ లేనిచోటునుండి …సందేహాలలోకి. యవ్వనమనే పేలవమైన కవచాన్ని తొడుక్కుని కుర్రవాడా! లెక్కలేనన్ని యుద్ధాలలో పాల్గొనాలి, ప్రేమబావుటా ఎగరేసి లోకాల్ని గెలవాలంటే, నిరసనగళమనే కరవాలమూ, సత్యమనే డాలూ తోడుండాలి. లోకంలోని నిరాశానిస్పృహలు నీచుట్టూ ఎగసిపడుతుంటాయి; అపజయాలకి నువ్వు లోనై, దారికోసం తడుముకుంటావు. నీ ఆవేశం, అవలక్షణమని నిను నిందించేస్థాయిలో ఉండాలి నిరాశాజనకమైన భవిష్యత్తుకి, నువ్వు ఆశల ఊపిరులూదాలి. […]