నాకూ వివేకం ఉంది… మారియో ఆంద్రాదే, బ్రెజీలియన్ కవి

నేను నా రోజులు లెక్కెట్టుకున్నాను.

నేను ఇప్పటివరకు బ్రతికినదానికంటే

ఇక బ్రతకడానికి ఎక్కువరోజులు లేవని

గ్రహించాను.

 

ఎక్కువ మిఠాయిలు దొరికిన పిల్లాడిలా ఉంది నా పరిస్థితి

మొదట్లో సంతోషంతో ఆబగా తినేస్తాడు

కానీ, ఇక అట్టే లేవని గ్రహించిన తర్వాత

ప్రతి మిఠాయినీ తీవ్రంగా అనుభూతిచెందుతూ తింటాడు.

ఇక అంతూపొంతులేని సమావేశాలకి నాకు తీరికలేదు

అక్కడ ఏదీ జరగదని తెలిసినా

చట్టాలూ, నిబంధనలూ, విధివిధానాలూ

అంతర్గత నియంత్రణలూ మొదలైనవి చర్చిస్తూనే ఉంటారు.

ఇక నాకు అసంగతంగా మాటాడే

మనుషుల్ని భరించే సహనం లేదు

వాళ్ళు ఎంత వయసు పైబడినా

ఏ మాత్రం ఎదగరు.

నాకున్న సమయం చాలా తక్కువ.

నాకు సారాంశం ముఖ్యం.

ఈ జీవుడు చాలా తొందరలో ఉన్నాడు.

నా సంచిలో ఇపుడు

అట్టే ఎక్కువ మిఠాయిలు మిగిలిలేవు.

నాకు మనుషులు తోడుగా బ్రతకాలని ఉంది.

చాలా వాస్తవంగా బ్రతికే వాళ్ళూ,

తమ తప్పులు చూసి నిండుగా నవ్వుకోగలిగేవాళ్ళూ

వాళ్ళ విజయాలు వర్లిస్తూ గర్వపడనివాళ్ళూ

వాళ్ళు చేసేపనులకు జవాబుదారీగా ఉండే వాళ్ళూ.

ఈ విధంగా మానవత్వంలోని హుందాతనం పరిరక్షించబడుతుంది

మనం నిజాయితీగా, గౌరవంగా బ్రతకగలుగుతాము.

ముఖ్యమైన విషయాలే జీవితానికి అర్థం ఇస్తాయి.

నా చుట్టూ అటువంటి మనుషులు ఉండేలా చూసుకుంటాను

వాళ్ళకి జీవితంలో దెబ్బతిన్నవాళ్ళ హృదయాలని ఎలా స్పృశించాలో తెలుస్తుంది

వాళ్ళు ఆత్మసంసర్గంతో ఎలా ఎదగాలో తెలిసినవారు.

నిజం!  నేను తొందరలో ఉన్నాను.

పరిణతి మాత్రమే ఇవ్వగలిగిన జీవితంపట్ల గాఢతతో తొందరపడుతున్నాను

మిగిలిన కొద్ది మిఠాయిలూ నేను వృధాచెయ్యదలుచుకోలేదు.

నాకు తెలుసు అవి చాలా అద్భుతమైన రుచితో ఉంటాయి.

ఇప్పటివరకూ నేను తిన్నవాటికంటే మిన్నగా.

నా లక్ష్యం నా గమ్యాన్ని సంతృప్తితో చేరుకోవడం

నా అంతరాత్మతో, నాకు ఇష్టమైనవారితో ప్రశాంతంగా ఉండడం.

మనకి ఉన్నవి రెండే జీవితాలు.

రెండవది మనకున్నది ఒక్కటే జీవితం అనితెలిసినపుడు మొదలౌతుంది.

.

మారియో దె ఆంద్రాదే,

(October 9, 1893 – February 25, 1945)

బ్రెజీలియన్ కవి

MY SOUL HAS A HAT

I counted my years
And realized that I have
Less time to live by,
Than I have lived so far.

I feel like a child who won a pack of candies:
At first he ate them with pleasure
But when he realized that there was little left,
He began to taste them intensely.

I have no time for endless meetings
Where the statutes, rules, procedures
And internal regulations are discussed,
Knowing that nothing will be done.

I no longer have the patience
To stand absurd people who,
Despite their chronological age,
Have not grown up.

My time is too short:
I want the essence,
My spirit is in a hurry.
I do not have much candy
In the package anymore.

I want to live next to humans,
Very realistic people who know
How to laugh at their mistakes,
Who are not inflated by their own triumphs
And who take responsibility for their actions.
In this way, human dignity is defended
And we live in truth and honesty.

It is the essentials that make life useful.
I want to surround myself with people
Who know how to touch the hearts of those whom hard strokes of life
Have learned to grow with sweet touches of the soul.

Yes, I’m in a hurry.
I’m in a hurry to live with the intensity that only maturity can give.
I do not intend to waste any of the remaining desserts.

I am sure they will be exquisite,
Much more than those eaten so far.
My goal is to reach the end satisfied
And at peace with my loved ones and my conscience.

We have two lives
And the second begins when you realize you only have

Mário de Andrade

9 October 1893 – 25 February 1945

Brazilian Poet, Novelist, Musicologist, Critic, Photographer and Art historian

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: