అనువాదలహరి

బిడ్డ పుట్టినపుడు … లూయీ అంటర్ మేయర్, అమెరికనుకవి

ఓ పిల్లవాడా! గెలుపు కేకలు వేసుకుంటూ,

జీవన రణరంగంలోకి నీ పాదాలను మోపావు

ఏ తగవులూ లేనిచోటునుండి… పోరాటస్థలికి

ఏ సంశయాలూ లేనిచోటునుండి …సందేహాలలోకి.

యవ్వనమనే పేలవమైన కవచాన్ని తొడుక్కుని

కుర్రవాడా! లెక్కలేనన్ని యుద్ధాలలో పాల్గొనాలి,

ప్రేమబావుటా ఎగరేసి లోకాల్ని గెలవాలంటే,

నిరసనగళమనే కరవాలమూ, సత్యమనే డాలూ తోడుండాలి.

లోకంలోని నిరాశానిస్పృహలు నీచుట్టూ ఎగసిపడుతుంటాయి;

అపజయాలకి నువ్వు లోనై, దారికోసం తడుముకుంటావు.

నీ ఆవేశం, అవలక్షణమని నిను నిందించేస్థాయిలో ఉండాలి

నిరాశాజనకమైన భవిష్యత్తుకి, నువ్వు ఆశల ఊపిరులూదాలి.

చీకటిలోమునిగిన ప్రపంచానికి నువ్వొక వెలుగుదివ్వె కావాలి,

దాని నిర్లిప్తతని నువ్వు చావుదెబ్బకొట్టాలి—

ఎందుకంటే, దాని బాధలూ, సంక్షోభాల్లోంచే నువ్వు పుట్టింది

దాని బాధలూ, సంక్షోభాలలోకే నువ్వు తిరిగి నిష్క్రమించేది.

.

లూయీ అంటర్ మేయర్

(October 1, 1885 – December 18, 1977)

అమెరికను కవి

.

On The Birth Of A Child

.

LO, to the battle-ground of Life,
Child, you have come, like a conquering shout,
Out of a struggle—into strife;
Out of a darkness—into doubt.

Girt with the fragile armor of youth,
Child, you must ride into endless wars,
With the sword of protest, the buckler of truth,
And a banner of love to sweep the stars.

About you the world’s despair will surge;
Into defeat you must plunge and grope.
Be to the faltering an urge;
Be to the hopeless years a hope!

Be to the darkened world a flame;
Be to its unconcern a blow—
For out of its pain and tumult you came,
And into its tumult and pain you go.

.

Louis Untermeyer

(October 1, 1885 – December 18, 1977) 

 American

Poem Courtesy: 

https://allpoetry.com/Louis-Untermeyer 

 

 

ప్రియతమా! నువ్వు ఆశ్చర్యపోకు… ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

ప్రియతమా! నా పెదాలు మౌనంగా ఉన్నాయని నువ్వు ఆశ్చర్యపోకు,

ఏ కొత్తభాష నేర్చుకోవాలన్నా కొంత సమయం పడుతుంది.

తొలిసారి ఈ వేళ్ళు ప్రేమవీణియ మీటినపుడు

నా గళమూ, నా మనసూ ఒక శృతిలో లేవు.

పాడిన పాటలన్నీ ఎప్పుడూ ఆనంద రుతాలే.

గులాబి దండల సంతోష హేలల రూపంలో ప్రేమ;

సంగీతంలా,గాఢానురక్తిని అతి సరళమైన

స్వరాల్లో నినదిస్తూ పలికించలేని అశక్తులవి.

ఇంతవరకు మౌనంగా ఉన్న నా పెదాలు

ధైర్యంగా పలకగల కొత్త నుడికారాన్ని వెతుకుతున్నాయి

నీనుండి పొందిన ప్రేరణ అనుభూతి చెందుతూ

ఆ గీత మాధుర్యానికి తన్మయత్వంలో మునిగాయి.

కనుక, నా మాటలు ఒక్కొకసారి నెమ్మదిగా, ఆగి ఆగి

వచ్చినపుడు, అసలు రహస్యమిదని నువ్వు గ్రహించుకో.

.

ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్,

(September 17, 1866 – April 30, 1925)

అమెరికను కవయిత్రి

.

You Should Not Wonder, Dear

.

You should not wonder, Dear, my lips are mute:

To learn a strange language must take time.

When first these fingers played upon Love’s lute,

Neither my soul nor voice were in the rhyme.

And then the tunes were always merry airs!-

Love in the guise of rose-wreathed joy and pleasure,-

And all unlike this music which declares

Deep passion throbbing through its simplest measure.

But now the lips that have been dumb so long

Struggle with words that are both brave and new,

Trembling, in all the ecstasy of song,

To feel the theme has been inspired by you.

So, when the words come haltingly and slow,

This sweetest reason for it you will know.

.

Antoinette De coursey Patterson

(September 17, 1866 – April 30, 1925)

American Poetess.

Poem Courtesy:

(Sonnets & Quatrains)

The Merrymount Press, Boston

February 1913

వనాంతర ప్రశాంతత… వెండెల్ బెరీ, అమెరికను కవి

ప్రపంచం పట్ల నాలో నిరాశ పేరుకున్నప్పుడూ,

నా, నా బిడ్డల భవిష్యత్తును గూర్చి చింతతో

చిరుసవ్వడికే రాత్రివేళ మెలకువ వచ్చినప్పుడూ,

తన జాతసౌందర్యంతో నీటిమీద తేలియాడే మగబాతునీ,

ఉదరపోషణ చేసుకునే కొంగనీ వీక్షించడానికి

సరస్సు దగ్గరకిపోయి విశ్రమిస్తాను.

రాబోయే బాధని ముందుగా ఊహించుకుని

తమజీవితాలు శోకమయం చేసుకోని

వన్యజీవుల ప్రశాంతత నన్నావహిస్తుంది.

నిశ్చలమైన నీటి సన్నిధిలో నిలబడతాను.

నా శిరసుపై దివాంధాలైన నక్షత్రాలు

తమ ప్రకాశంతో నాకై నిరీక్షించడాన్ని గుర్తిస్తాను.

కాసేపు, ప్రకృతి అవ్యాజప్రేమలో తరిస్తాను… స్వేఛ్ఛాజీవినై.

.

ఆంగ్ల మూలం :    వెండెల్ బెరీ

 Wendell Berry

Image  Courtesy: 

http://en.wikipedia.org/wiki/File:Wberry.jpg 

 

 

The Peace of Wild Things

.

When despair for the world grows in me

and I wake in the night at the least sound

in fear of what my life and my children’s lives may be,

I go and lie down where the wood drake

rests in his beauty on the water, and the great heron feeds.

I come into the peace of wild things

who do not tax their lives with forethought

of grief. I come into the presence of still water.

And I feel above me the day-blind stars

waiting with their light. For a time

I rest in the grace of the world, and am free.

.

Wendell Berry

(born August 5, 1934)

American novelist, poet, environmental activist, cultural critic, and farmer.

 

నాకూ వివేకం ఉంది… మారియో ఆంద్రాదే, బ్రెజీలియన్ కవి

నేను నా రోజులు లెక్కెట్టుకున్నాను.

నేను ఇప్పటివరకు బ్రతికినదానికంటే

ఇక బ్రతకడానికి ఎక్కువరోజులు లేవని

గ్రహించాను.

 

ఎక్కువ మిఠాయిలు దొరికిన పిల్లాడిలా ఉంది నా పరిస్థితి

మొదట్లో సంతోషంతో ఆబగా తినేస్తాడు

కానీ, ఇక అట్టే లేవని గ్రహించిన తర్వాత

ప్రతి మిఠాయినీ తీవ్రంగా అనుభూతిచెందుతూ తింటాడు.

ఇక అంతూపొంతులేని సమావేశాలకి నాకు తీరికలేదు

అక్కడ ఏదీ జరగదని తెలిసినా

చట్టాలూ, నిబంధనలూ, విధివిధానాలూ

అంతర్గత నియంత్రణలూ మొదలైనవి చర్చిస్తూనే ఉంటారు.

ఇక నాకు అసంగతంగా మాటాడే

మనుషుల్ని భరించే సహనం లేదు

వాళ్ళు ఎంత వయసు పైబడినా

ఏ మాత్రం ఎదగరు.

నాకున్న సమయం చాలా తక్కువ.

నాకు సారాంశం ముఖ్యం.

ఈ జీవుడు చాలా తొందరలో ఉన్నాడు.

నా సంచిలో ఇపుడు

అట్టే ఎక్కువ మిఠాయిలు మిగిలిలేవు.

నాకు మనుషులు తోడుగా బ్రతకాలని ఉంది.

చాలా వాస్తవంగా బ్రతికే వాళ్ళూ,

తమ తప్పులు చూసి నిండుగా నవ్వుకోగలిగేవాళ్ళూ

వాళ్ళ విజయాలు వర్లిస్తూ గర్వపడనివాళ్ళూ

వాళ్ళు చేసేపనులకు జవాబుదారీగా ఉండే వాళ్ళూ.

ఈ విధంగా మానవత్వంలోని హుందాతనం పరిరక్షించబడుతుంది

మనం నిజాయితీగా, గౌరవంగా బ్రతకగలుగుతాము.

ముఖ్యమైన విషయాలే జీవితానికి అర్థం ఇస్తాయి.

నా చుట్టూ అటువంటి మనుషులు ఉండేలా చూసుకుంటాను

వాళ్ళకి జీవితంలో దెబ్బతిన్నవాళ్ళ హృదయాలని ఎలా స్పృశించాలో తెలుస్తుంది

వాళ్ళు ఆత్మసంసర్గంతో ఎలా ఎదగాలో తెలిసినవారు.

నిజం!  నేను తొందరలో ఉన్నాను.

పరిణతి మాత్రమే ఇవ్వగలిగిన జీవితంపట్ల గాఢతతో తొందరపడుతున్నాను

మిగిలిన కొద్ది మిఠాయిలూ నేను వృధాచెయ్యదలుచుకోలేదు.

నాకు తెలుసు అవి చాలా అద్భుతమైన రుచితో ఉంటాయి.

ఇప్పటివరకూ నేను తిన్నవాటికంటే మిన్నగా.

నా లక్ష్యం నా గమ్యాన్ని సంతృప్తితో చేరుకోవడం

నా అంతరాత్మతో, నాకు ఇష్టమైనవారితో ప్రశాంతంగా ఉండడం.

మనకి ఉన్నవి రెండే జీవితాలు.

రెండవది మనకున్నది ఒక్కటే జీవితం అనితెలిసినపుడు మొదలౌతుంది.

.

మారియో దె ఆంద్రాదే,

(October 9, 1893 – February 25, 1945)

బ్రెజీలియన్ కవి

MY SOUL HAS A HAT

I counted my years
And realized that I have
Less time to live by,
Than I have lived so far.

I feel like a child who won a pack of candies:
At first he ate them with pleasure
But when he realized that there was little left,
He began to taste them intensely.

I have no time for endless meetings
Where the statutes, rules, procedures
And internal regulations are discussed,
Knowing that nothing will be done.

I no longer have the patience
To stand absurd people who,
Despite their chronological age,
Have not grown up.

My time is too short:
I want the essence,
My spirit is in a hurry.
I do not have much candy
In the package anymore.

I want to live next to humans,
Very realistic people who know
How to laugh at their mistakes,
Who are not inflated by their own triumphs
And who take responsibility for their actions.
In this way, human dignity is defended
And we live in truth and honesty.

It is the essentials that make life useful.
I want to surround myself with people
Who know how to touch the hearts of those whom hard strokes of life
Have learned to grow with sweet touches of the soul.

Yes, I’m in a hurry.
I’m in a hurry to live with the intensity that only maturity can give.
I do not intend to waste any of the remaining desserts.

I am sure they will be exquisite,
Much more than those eaten so far.
My goal is to reach the end satisfied
And at peace with my loved ones and my conscience.

We have two lives
And the second begins when you realize you only have

Mário de Andrade

9 October 1893 – 25 February 1945

Brazilian Poet, Novelist, Musicologist, Critic, Photographer and Art historian

రాబర్ట్ బ్లూమ్ ఫీల్డ్ స్మృతిలో… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి

Robert Bloomfield

(3 December 1766 – 19 August 1823)

Was a self-educated English working-class poet, admired by Stephen Duck, Mary Collier and John Clare.

 

Image Courtesy: http://etc.usf.edu/clipart/32000/32088/bloomfield_32088.htm

నిరాడంబరంగా కమ్మని గీతాలాలపించుకునే గాయకమణీ

ఈనాటి మిరిమిట్లుగొలిపే ఆడంబరాలు నీకు నచ్చవు.

సహజమైన ప్రకృతిదృశ్యాలూ, పొలాలూ, మేఘమాలికలూ

తరులూ, శ్రమజీవులైన తేనెటీగలూ లలితలలితమైన

తమరాగాలతో నీపాటకి సంగీతాన్ని సమకూరుస్తాయి.

ప్రకృతే నిన్ను అక్కునజేర్చుకుంది; మంది గుర్తించక పోతే పోనీ.

రెంటికీ ప్రకృతే వనరై, భూమ్యాకాశాలు ప్రతియేడూ

వాటి తరగలలో త్వరితాన్ని తీసుకువచ్చినా,

ఉధృతంగా పొరలే నాగరికపు సెలయేటి కెరటాలు బలమైనవి

మనసులో పాడుకుంటూ నిదానంగా పారే పల్లెవాగులు తట్టుకోలేవు.

గాయపడిన నీ గీతానికి వగవనక్కరలేదు.

ఎందుకంటే వేసవి ఎండలు సెలయేటి నీరు ఎండగట్టినా

నీ తేనీటి ఊటల వాగు గలగలలు శాశ్వతంగా నిలిచిఉంటాయి.

.

జాన్ క్లేర్

(13 July 1793 – 20 May 1864)

ఇంగ్లీషు కవి

In Memory of Robert Bloomfield

.

Sweet unassuming Minstrel not to thee

The dazzling fashions of the day belong

Natures wild pictures field and cloud and tree

And quiet brooks far distant from the throng

In murmurs tender as the toiling bee

Make the sweet music of thy gentle song

Well—nature owns thee let the crowd pass bye—

The tide of fashion is a stream too strong

For pastoral brooks that gently flow and sing

But nature is their source and earth and sky

Their annual offerings to her current bring

Thy injured muse and memory need no sigh

For thine shall murmur on to many a spring

When their proud stream is summer burnt and dry

.

John Clare

(13 July 1793 – 20 May 1864)

English Poet

Poem courtesy:

https://www.cambridgescholars.com/download/sample/60814   page 7

ఈ లోకంతో మనం అతిగా ప్రవర్తిస్తున్నాం… విలియమ్ వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి

వర్డ్స్ వర్త్ ప్రముఖ ప్రకృతి కవి. పారిశ్రామిక విప్లవం మనుషులలో తీసుకువచ్చిన భౌతికవాదానికి… అంటే ప్రకృతిని తన ఉనికికి మూలకారణమైన చేతన శక్తిగా కాక, తాత్కాలిక ప్రయోజనాన్ని కలిగించే వనరుగా చూడడం అతనికి నచ్చదు. ఈ భౌతిక సుఖాలవేటలో పడిన మనిషి దృశ్యమాన జగత్తులోని అందాలకి పరవశించి తన హృదయాన్ని ఉన్నతంగా చేసుకోగలిగే అవకాశాన్ని కోల్పోతున్నాడని అతని ఆరోపణ.

ఈ కవితలో “మనిషి తన తెలివితేటలని, జీవితాన్ని డబ్బుసంపాదనకి పణం పెట్టి, తను భాగమైన ఈ అనంతప్రకృతిని నాశనం చేస్తూ, కనీసం దాన్ని చూసి ఆనందించే అవకాశం కోల్పోతున్నాడు,” అని చెబుతున్నాడు. జ్ఞానవంతుడై ప్రకృతిని నాశనం చేసే నేటి ఈ స్థితికంటే, ఏ అనాగరిక జాతిలోపుట్టి,అజ్ఞానంలో మగ్గినా, ఈ ప్రకృతిని చూసి పరవశించే అవకాశం కోల్పోకపోవడమే ఉత్తమమని అతని భావన. మనం చేజేతులా వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్నాం అని అతని వేదన.

ప్రగతి పేరుతో, భావితరాలపట్ల మన బాధ్యత కించిత్తుకూడా పట్టించుకోకుండా, ఉన్న ప్రకృతి వనరులన్నీ ఇప్పుడే దోచుకుందికి తాపత్రయపడుతున్న (ప్రపంచవ్యాప్తంగా) ప్రభుత్వాలూ, పారిశ్రామికవేత్తలూ ఉన్న ఈ రోజులు మనం గమనించినపుడు 200 సంవత్సరాల క్రిందట అతను రాసిన ఈ హృదయవేదన ఎంత సమంజసమైనదో మనం గ్రహించవచ్చు.

.

ఈ లోకంతో మనం అతిగా ప్రవర్తిస్తున్నాం, నాడూ నేడూ,

సంపాదనకీ, ఖర్చుపెట్టడానికే మన శక్తుల్ని వృధాచేసుకుంటున్నాం;

ప్రకృతిలో మనదంటూ ఏదీ గుర్తించలేకున్నాం;

మనహృదయాల్ని పణంపెట్టుకుని, క్షుద్రవరాల్ని ఇచ్చుకుంటున్నాం!

వెన్నెలకి తన హృదయాన్ని అర్పించుకుంటున్న ఈ సముద్రమూ

ఎల్లవేళలా తెరలుతెరలుగా వీచే ఈ చల్లగాలీ,

మనం ఇప్పుడు రాలిన పువ్వుల్లా ఏరుకుంటున్నాం.

దీనికి, ఆమాటకొస్తే ప్రతివిషయంలోనూ మనం గాడితప్పాం,

భగవంతుడా! మనల్ని ఏదీ కదిలించదు. నేను

అంతరించిన ఏ అనాగరికజాతిలో పుట్టినా విచారించను;

అప్పుడు నేను ఈ ఆహ్లాదకరమైన పచ్చికబీడులో నిలబడి

కనిపించే దృశ్యాలు నేను ఏకాకినన్న అనుభూతి కలిగించవు;

సముద్రంలోంచి ‘ప్రాటియస్ ‘అనేకరూపాల్లో ఉద్భవించడమూ చూస్తాను;

పురాణపురుషుడు ట్రైటన్ ఊదే శంఖనాదాన్నీ వినగలను.

.

విలియమ్ వర్డ్స్ వర్త్,

 (7 April 1770 – 23 April 1850)

ఇంగ్లీషు కవి

 

 

The World is too much with us.

.

The world is too much with us; late and soon,

Getting and spending, we lay waste our powers;—

Little we see in Nature that is ours;

We have given our hearts away, a sordid boon!

This Sea that bares her bosom to the moon;

The winds that will be howling at all hours,

And are up-gathered now like sleeping flowers;

For this, for everything, we are out of tune;

It moves us not. Great God! I’d rather be

A Pagan suckled in a creed outworn;

So might I, standing on this pleasant lea,

Have glimpses that would make me less forlorn;

Have sight of Proteus rising from the sea;

Or hear old Triton blow his wreathèd horn.

.

William Wordsworth

(7 April 1770 – 23 April 1850)

English Poet

Ember-Thief… Sikhamani, Telugu, Indian Poet

WISH ALL MY FRIENDS

WELL WISHERS

AND

BLOG VIEWERS

A VERY HAPPY

AND

PROSPEROUS

NEW YEAR

2019

***

Sitting under a leaf-less tree

On the footpath

And sweating profusely,

An old man was parching

The cobs of Maize on coals.

 

More than his face

His chafing-dish

Seemed cooler on scrutiny.

 

As he took each cob

Caressingly into his hands

And gently removed each sheath one after another

He seemed to unveil his long inventory of life’s experiences.

 

In the scorching sun

While everyone else

Tried to cool-off themselves with

Either newspaper

Or a handkerchief

Heaving out the heat,

He was fanning the coals

Continuously with a bamboo fan

Lest the fire of his life should cease.

As he upturned the live coals

Making tongs of his fingers

I was reminded of my uncle Sikhamani

Who, in my childhood,

Used to pull the hot curry bowl

Off the fire with bare hands.

Perhaps, fire can do them no harm

Who carry far greater heart-burns within.  

 

As sedulously as a poet writing his poem

He was roasting each pod

Turning them on sides so that they are

Neither too charred like coal

Nor too green without losing their raw odour.

 

 Like the jealous world

That cannot bear a poor man prospering

All of sudden the sky was overcast

And it started drizzling.

And then started his desperate trial

To keep the fire in the coals alive.

 

He moved the chafing-dish to a dry place

And the rain followed him.

He tried to cover it with too inadequate piece of sack

It was drenched in rain.

And in a final bid

He pulled the dish between his calves

Making an umbrella of his tummy

And hedged it with his hands.

And the threatening rain

Disappeared as quickly as it appeared.

 

Then I realized

That fire is needed not just to roast the cobs

But essential to life itself.

And also, that it is not easy keep it alive.

 

Pretending a bargain

I could somehow con him

To steal an ember from him.

 

Now

I must kindle the fire within

Like I did in my childhood

Borrowing coals from my neighbour

In the folds of a dry coconut leaf

Or, on a piece of dung cake.

 

.

 

Sikhamani

(Karri Sanjiva Rao)

Telugu,  Indian Poet

 

http://www.sikhamani.com/about.html

 

నిప్పుదొంగ

 

ఎవరో ముదుసలి

ఫుట్ పాత్ మీద

ఆకుల్లేని చెట్టునీడన

చెమటలు కక్కుతూ 

మొక్కజొన్నపొత్తులు కాలుస్తున్నాడు.

 

చూడబోతే

అతని ముఖంకంటే

ఆ నిప్పులకుంపటే చల్లగా వున్నట్టుంది.

 

అతను ఒక్కొక్క పొత్తునూ

ప్రేమగా చేతుల్లోకి తీసుకుని

ఒక్కొక్క పొరనే వొలుస్తూంటే

జీవితానుభవాల పొరలను వొలుస్తున్నట్టుంది.

 

మండే ఎండలో

న్యూస్ పేపరుతోనో

జేబురుమాలుతోనో

ఎవరికివారే

ఉస్సురుస్సురని విసురుకుంటుంటే

అతనుమాత్రం వెదురుబద్దల విసనికర్రతో

బతుకు కుంపటిని ఆరనీయకుండా

అదేపనిగా విసురుతూనే ఉన్నాడు.

చేతివేళ్ళను పట్టకారునిచేసి

కణకణమండే నిప్పుల్ని

అటూ ఇటూ సర్దుతున్న అతన్ని చూస్తుంటే

చిన్నప్పుడు

మండుతున్నపొయ్యిమీదనుండి

ఉడుకుతున్న కూరదాకను

ఉత్తచేతులతోనే దించిన

మా శిఖామణి అంకులు గుర్తుకొచ్చాడు.

లోపల నిప్పులగుండం ఉన్నవాడిని

బహుశా బయటి నిప్పు కాల్చలేదనుకుంటాను.

 

గింజలు అటు పచ్చీ కాకుండా

ఇటు మాడిపోకుండా

అటూ ఇటూ తిప్పుతూ

ఒక కవి కవిత్వం రాసుకుంటున్నంత ప్రేమగా

అతను పొత్తులను కాలుస్తున్నాడు.

 

పేదవాడు బాగుంటే ఓర్వలేని లోకంలా

వున్నట్టుండి ఆకాశం మూసుకొచ్చింది

చూస్తుండగానే చినుకులు మొదలయ్యాయి

అక్కడనుండి మొదలయ్యింది అతని ఆత్రం

ఎలాగైనా నిప్పుని ఆరనీయకూడదని.

 

కుంపటిని కాస్త పొడినేలవైపు జరిపాడు

చినుకులూ అటువైపు జరిగాయి

చాలీచాలని గోనెపట్టాని కప్పబోయాడు

అదీ తడిసి ముద్దయ్యింది

ఇక లాభంలేదనుకుని

కుంపటిని కాళ్ళమధ్యకు లాక్కుని

పొత్తికడుపును గొడుగుచేసి

చేతులు దడికట్టాడు.

బెదిరించడానికొచ్చినట్టు

ఇట్టేవచ్చి అట్టే వెలిసింది వర్షం.

 

అప్పుడనిపించింది.

నిప్పు కేవలం జొన్నపొత్తులు కాల్చడానికి కాదు

జీవితానికీ అవసరం అనీ

నిప్పును కాపాడు కోవడం అంత తేలికకూడా కాదనీ.

 

పొత్తులు బేరమాడుతున్నట్టు నటించి

అతని కన్నుగప్పి ఎలాగోలా

ఓ నిప్పుకణికను దొంగిలించాను.

 

మడిచిన ఎండు కొబ్బరాకుల్లోనో

పిడకచెక్కమీదో

పక్కింటినుండి ఇన్ని నిప్పులు తెచ్చి

చిన్నప్పుడు యింట్లో పొయ్యి రాజేసినట్టు

ఇక ఇప్పుడు

నన్ను నేను రాజేసుకోవాలి.

.

శిఖామణి

 

సాహితి

ఆంధ్రభూమి 27 సెప్టెంబరు 2002

%d bloggers like this: