రోజు: డిసెంబర్ 9, 2018
-
ఒక శిల్పి అంతిమ యాత్ర… విలా కేథర్, అమెరికను
లౌకిక అవసరాలకై వెంపర్లాట తప్ప మరొకటి తెలియని మనకి, దానికి అతీతమైన జీవితం ఉంటుందనీ, కొందరు దానికోసం తమ సర్వస్వం ధారపోస్తారనీ, ఈ లౌకిక విషయాలకి వాళ్ళు గుడ్డిగవ్వ విలువ ఇవ్వరనీ చాలా సున్నితంగా చెప్పిన కథ ఇది. *** కాన్సాస్ రాష్ట్రంలో అదొక చిన్న నగరం. అది శీతకాలం రాత్రి. ఆ ఊరిలోని కొందరు పౌరులు రైల్వే స్టేషనులో రైలింగుకి చేరబడి బండి కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటికే అది రావడం 20 నిముషాలు ఆలస్యం…