ఈరోజు… ఎమొరీ హేర్, అమెరికను కవయిత్రి
రేపు నేను చచ్చిపోతేనేం? నేనిప్పుడు జీవించే ఉన్నాను.
అనేకానేక అవకాశాలతో నిండుగా ఉన్న ఈ రోజు,
నాదే! దాని సంకుచిత పరిధిలోనే
నాకు కన్నీళ్ళూ, పట్టలేని ఆనందమూ కలగొచ్చు; బహుశా,
ఒక గంటలో ఆనందానికీ అంతులేని నిరాశకీ మధ్యనున్న
అన్ని అనుభూతులూ పొందవచ్చు; చైతన్యవంతమైన జీవితమా!
నీసంగతి నాకు తెలుసు. నువ్వంటే నాకు అపరిమితమైన ప్రేమ!
ఈ శరీరం గురించిన స్పృహ విడిచిపెట్టి అందులో లీనమై
సువిశాలమైన ఆకాశంతో జతగలిసి శ్వాసిస్తున్నప్పుడు
వీడ్కోలు పలకాలన్న భయం ఆ గంట ఆనందపు విలువ తగ్గించదు.
ఎందుకంటే… నాలాంటి మరో ప్రాణికి …
ఈ రోజు అన్నిటా అందంగా కనిపిస్తాను…
తనకి నేనే వెలుగుని, నేనే తారకానివహాన్ని,
నేనే ఊపిరి, అతనికోసం సమకూర్చిన విశ్వస్వరపేయాన్ని!
అతనికి నేనొక సమ్మోహనాన్ని, తీపునుకూడా
ఆనందంతో సరితూగే తీయని బాధని.
నా గురించి కలిగే ఆలోచనాలేశం చాలా సున్నితంగా
సాంధ్య వెలుగులనీ, వానకోవిల గీతాన్నీ అల్లుకుంటుంది;
గుమ్మంముందరి సన్నని దీపం, పొలాలలో దట్టమౌతున్న చీకటి
దీర్ఘమైన రాదారి మలుపు, అక్కడికి ఎగబాకే లాంతరు వెలుగు;
నేలవాలిన చూరులూ, చందురునితోడుగా కలగంటాయి.
అతనికి ఏది పునర్జన్మనిస్తుందో అది నేనే;
కొవ్వొత్తి వెలుగులో, చలిగూడు వెచ్చదనాన్నిచ్చేదీ
రెండు హృదయాల కలయికలోని చిత్రాన్నీ నేనే.
నాలో చిత్రంగా, స్వర్గమంత తెలియలేని దూరాలే కాదు,
గడ్డిపరకంత పరిచయమున్న సామీప్యతా ఉంది;
నన్నెందుకు ఈ పురాతన వశీకరణ ఆవహించిందో
తర్కిస్తూ ఉన్న ఈ కొద్ది సమయాన్నీ వృధాచెయ్యను.
నా ప్రేమికుని కన్నులు నా కనులలోకి ఆశగా చూస్తున్నాయి
ఒక్క క్షణం, అంతే, నా శరీరంలో అణువణువూ అందుకున్నాయి
“ఈ రోజు నాది, నాదే, ఈ ఆనందమంతా నాదే” నన్న ఆలాపన.
.
ఎమొరీ హేర్
(1885-1964)
అమెరికను కవయిత్రి
TO-DAY
“It that though I die to-morrow? Now I live!
To-day, close-packed with opportunity,
Is mine; within whose span I may possess
Laughter and tears, mayhap, and in one hour
Run the whole scale ‘twixt joy and deep despair.
Warm sentient life, I know and love thee well!
No dread of parting shall bedim that hour
When all my Self shall pass and be dispersed
To join the spacious breathing of the sky.
For, to one Being — kindred to my own —
To-day I have been all things beautiful.
To one I am the stars, the light, the breath
The music of the world set forth for him!
And I am witchery and even woe —
Woe of a quality akin to joy.
The thought of me is subtly intertwined
With twilight, and the wheeling swallow’s cry;
With doorways dimly lit, and dark’ning fields;
The long road’s ending and the lantern’s gleam;
With little roofs adream beneath the moon.
For I am that by which he is reborn;
The dearness of the hearth by candlelight;
The mystery wherein two spirits blend.
I have the strange remoteness of the heavens
And yet the patient nearness of the grass.
I will not waste one hour to question why
This old enchantment should have come to me;
Love’s shining eyes looked bravely into mine
A moment since, and all my being sang
“To-day is mine is mine and it is joy!”
.
Amory Hare
(1885-1964)
American Poetess
Poem Courtesy:
Here is a very interesting story about the poet whose poem adorned the tombstone of her cousin was largely referred to as written by an anonymous poet until…
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి