నా జీవితమంతా ముందరి వాకిట్లోనే గడిపాను.
నా కొకసారి పెరట్లోకి తొంగి చూడాలని ఉంది
అక్కడ ఏ సంరక్షణా లేక, గరుకుదేరి ఆబగా రొడ్డబలిసింది.
అక్కడ పూచిన గులాబికూడా అందంగా కనిపించదు.
నేనుప్పుడు ఆ పెరట్లోకి వెళ్దా మనుకుంటున్నాను.
అనాధపిల్లలు ఆడుకుంటున్న ఆ చోటుకి
వీలయితే వీధిచుట్టూ తిరిగైనా.
ఇవాళ నాకు ఆనందంగా గడపాలని ఉంది.
వాళ్ళు చాలా అద్భుతమైన పనులు చేస్తుంటారు.
వాళ్ళు హాయిగా కేరింతలాడుకుంటూ ఆనందంగా ఉంటారు.
మా అమ్మ అసహ్యించుకుంటుంది గాని, నే నైతే అది బాగుందంటాను.
వాళ్ళెంత అదృష్టవంతులో కదా! పావుతక్కువ తొమ్మిదికి
ఇంట్లోకి రావలసిన బలవంతం లేదు.
మా అమ్మ అంటుంటుంది జానీ మే
పెద్దయేక చెడుతిరుగుళ్ళు తిరుగుతుందని.
ఆ జార్జి నేడో రేపో జైలు కెళతాడనీని.
(ఎందుకంటే మా పెరటి తలుపు క్రిందటి చలికాలం అమ్మేసేడు)
నేను మాత్రం ఫర్వాలేదంటాను. నిజంగా! ఒట్టు!
నాకుకూడా కారునలుపు లేసులతో అల్లిన మేజోళ్ళు తొడుక్కుని,
ధైర్యంగా ముఖానికి రంగు పులుముకుని రోడ్లంబట తిరగాలనీ
చెడ్డపిల్లని అనిపించుకోవాలనీ ఉంది.
.
గ్వెండొలీన్ బ్రూక్స్
(June 7, 1917 – December 3, 2000)
అమెరికను కవయిత్రి
Gwendolyn Brooks
స్పందించండి