రోజు: నవంబర్ 27, 2018
-
పెరటి పాట… గ్వెండొలీన్ బ్రూక్స్, అమెరికను కవయిత్రి
నా జీవితమంతా ముందరి వాకిట్లోనే గడిపాను. నా కొకసారి పెరట్లోకి తొంగి చూడాలని ఉంది అక్కడ ఏ సంరక్షణా లేక, గరుకుదేరి ఆబగా రొడ్డబలిసింది. అక్కడ పూచిన గులాబికూడా అందంగా కనిపించదు. నేనుప్పుడు ఆ పెరట్లోకి వెళ్దా మనుకుంటున్నాను. అనాధపిల్లలు ఆడుకుంటున్న ఆ చోటుకి వీలయితే వీధిచుట్టూ తిరిగైనా. ఇవాళ నాకు ఆనందంగా గడపాలని ఉంది. వాళ్ళు చాలా అద్భుతమైన పనులు చేస్తుంటారు. వాళ్ళు హాయిగా కేరింతలాడుకుంటూ ఆనందంగా ఉంటారు. మా అమ్మ అసహ్యించుకుంటుంది…