వస్తువులలోని స్వారస్యాన్ని ఇట్టే పసిగట్టడానికి
కొన్ని హృదయాలకి కేవలం ఒక పూవు స్పర్శ చాలు.
ఒక గులాబిపొద సరసన, వాళ్ళ కళ్ళముందు
ఒక వెలుగుదారి తెరుచుకుంటుంది వాళ్ళ ఊహలు
ఒక్కసారి విచ్చుకుని అన్ని దిక్కులా పరిగెడుతుంటే.
వాళ్ళకి దారి చూపించడానికి ఒక తారక వచ్చినా రావొచ్చు
లేదా, అదుపుతీసిన ఊటలోంచి జలచిమ్మినట్టు కోకిల రాగమో,
లేదా, ఎక్కడో ఏ మూలనుండో అకస్మాత్తుగా వాళ్ళ పాదాలమీద
సూర్యుడి కిరణమొకటి వాలి సరియైన మార్గం చూపించవచ్చు.
అపుడు వారి ఊహలు ఎంత ఎత్తుకి ఎదుగుతాయంటే
చుట్టూ అంతా చిమ్మచీకటీ, శైధిల్యమే.
కాలాతీతంగా పిల్లలు కోరుకునేది అదే.
ఒక గులాబి, ఒక చుక్క, సముద్రపొడ్డున గవ్వ…ఇవే
పిల్లల ఎంపిక;వాళ్రికి నిగూఢ రహస్యాలు విప్పిచెబుతాయి.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17.9.1866 – 30.4. 1925
అమెరికను కవయిత్రి
Children Elect
It needeth but a flower’s touch to thrill
Some souls to an exquisite sense of things.
A shining path at just a rose’s will
Opens before them, its meanderings
To their awakened fancy now revealed.
Perchance there comes a star to guide them through,
Or thrush’s note like silver fount unsealed,
Or else across their steps from out the blue
A sunbeam darts to show the fairest way.
Ever that fancy finds some height to climb
Where all around is darkness and decay.
Children Elect they are, and for all time:
A rose, a star, a shell that holds the sea,
Unlocks for them sublimest mystery
.
Antoinette De Coursey Patterson
17.9.1866 – 30.4.1925
American Poet
స్పందించండి