రోజు: ఆగస్ట్ 27, 2018
-
ప్రాపంచిక సుఖాలకి వీడ్కోలు… ఏన్ కిలిగ్రూ, ఇంగ్లీషు కవయిత్రి
నశ్వరమైన సుఖాల్లారా! మీకు వీడ్కోలు బంగారు పూతపూసిన మిధ్యలు మీరు, తళుకులీనే బొమ్మలు చాలకాలం నా మనసు వశంచేసుకుని దారితప్పించారు రిక్తభక్ష్యాలతో నా కడుపునింపారు. చాలు! ఇక మీరు నా మనసుని పూర్వంలా మోసగించలేరు. ఎందుకంటే, ఇథాకా రాజు యులిస్సిస్ ని మోసగించిన మాయా సంగీతం మీరు వినిపించినా దృఢనిశ్చయంతో నా మనసునీ, నా కోరికలని అతన్ని వాడ స్తంభానికి కట్టినదానికంటే గట్టిగా నా వివేకానికి బంధించుకుంటాను. అపుడు, మీ మంత్రతంత్రాలు నా చెవి సోకినా అతనిలాగే,…