మనిషి – సింప్లాన్ మహాపర్వతం… మాగ్జీం గోర్కీ 

ఎప్పుడూ మంచుతోకప్పబడి ఉండే మహాపర్వతాల మధ్య ఆ స్వచ్ఛమైన సరస్సు ఉంది. ఆ కనుమలమధ్య దట్టమైన ఉద్యానవనాలు నీటి అంచుదాకా పరుచుకున్నాయి. ఒడ్డునున్న తెల్లటి ఇళ్ళు, నిర్మలమైన నీటిలో పంచదార బిళ్ళల్లా ప్రతిఫలిస్తున్నాయి. పరిసరాలంతటా నిద్రిస్తున్న పిల్లవాడి ప్రశాంతత పరుచుకుంది.

ఉదయం కావొచ్చింది. కొండలవాలులోని తోటలనుండి విరుస్తున్న పువ్వులపరిమళం సన్నగా తేలుతూ నాలుగుచెరగులా వ్యాపిస్తోంది. అప్పుడే సూర్యుడు ఉదయించాడు. చెట్ల ఆకులకీ, పూరేకులకీ ఇంకా వదల్లేక అంటిపెట్టుకున్న మంచు మెరుస్తోంది. ఆ ప్రశాంతమైన పర్వతప్రాంతంలోంచి, రాళ్ళతో వేసినదే అయినా, ముఖ్మలులా మెత్తగా, దాన్ని ఒకసారి తాకాలని కోర్కె రగిల్చే నల్లటి రిబ్బనులాటి రోడ్డు ఒకటి చొచ్చుకొనిపోతోంది.

రోడ్డు ప్రక్కన రాళ్ళగుట్టదగ్గర నల్లని కీటకంలా పనివాడొకడు కూర్చుని ఉన్నాడు; అతని గుండెమీద ఒక పతకం వేలాడుతోంది. అతని ముఖం ప్రస్ఫుటంగా గంభీరంగా ఉన్నా ప్రసన్నంగానే ఉంది.

ఎండలో పనిచేసి పనిచేసి నలుపెక్కిన చేతుల్ని ముణుకులమీద పెట్టుకుని, పక్కన చెస్ట్ నట్ (బాదంవంటి చెట్టు) నీడలో సేదదీరుతున్న బాటసారుల ముఖాల్లోకి తొంగిచూస్తూ ఇలా అంటున్నాడు:

“దొరలూ! ఇది సింప్లాన్ మహాపర్వతం. ఈ సింప్లాన్ సొరంగం తవ్వకంలో పనిచేసినందుకే నాకీ పతకాన్నిచ్చేరు,”

అంటూ,కళ్ళుక్రిందకి వాల్చి మెరుస్తున్న ఆ పతకంవైపు మురిపెంగా సంతృప్తిగా చూసేడు.

“ఓహ్ అదా! ఏ పనైనా మొదట కష్టంగా ఉంటుంది అలవాటుపడేదాకా. ఒకసారి అలవాటు పడ్డాక అదే సుళువుగా అనిపిస్తుంది. అయినా, ఆ తవ్వకంపని మాత్రం నిజంగా చాలా కష్టమైంది.”

సూర్యుడివంక చూస్తూ, కొద్దిగా తలతాటించేడు; ఆలోచనలలోంచి బైటపడి, వెళుతున్నవారివంక చేతులూపేడు. నల్లని అతని కళ్ళలో ఏదో మెరుపు ఉంది.

“నాకు అప్పుడప్పుడు భయమేసేది. ఈ భూమికికూడా మనలాగే నొప్పి ఉంటుంది కదా? అని. మీకు అలా అనిపించదా?  మేము చాలా లోతుకి సొరంగం తవ్విన తర్వాత, ఆ కొండలకి లోతుగా అంతగాయం చేసిన తర్వాత, సహజంగానే ఈ నేల మాతో చాలా మొరటుగా ప్రవర్తించింది.  మా ముఖాలమీద వేడి గాలి ఊదింది. దాంతో మాకు గుండె ఆగినంత పనైంది. మా తల తిరగడం ప్రారంభించి ఎముకలు సలపడం ప్రారంభించేయి. మాలో చాలామందికి ఇలాంటి అనుభవమే కలిగింది. తర్వాత తల్లి భూదేవికి కోపం వచ్చి పిల్లలమీద రాళ్ళవర్షం కురిపించింది. మామీద వేడినీళ్ళు గుమ్మరించింది. దొరా, నిజం, అప్పుడు గొప్పభయమేసిందనుకో. అప్పుడప్పుడు, టార్చిలైటు వెలుగులో ఆ నీళ్ళు ఎర్రగా కనిపించేవి. మా నాన్న అంటుండేవాడు, మనం తల్లి భూదేవిని గాయపరిచేం; అందుకని ఆ అమ్మ మనల్నందరినీ ఆమె తన రక్తంలో ముంచి, సలసలా మరిగించి చంపుతుంది…  ‘నువ్వు అది కళ్ళారా చూస్తావు’  అని.

అదంతా కేవలం ఊహే! అయితేనేం, అంత లోతు సొరంగంలో, చిమ్మ చీకట్లో, చేతులకీ కాళ్ళకీ ఒంటికీ చెమ్మతగులుతూ ఊపిరాడకుండాఉన్న వాతావరణంలో ఒకప్రక్క చిమ్ముతన్న నీరు, మరొకవంక రాతినిదొలుస్తూ మిషను చప్పుడుచేస్తున్న సమయంలో  ఎవరైనా అలాంటి మాటలు వింటే, అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అన్న విచక్షణ క్షణకాలం ఎవరికీ కలగదు. దొరా, అక్కడ అంతా అద్భుతంగా ఉంటుంది. మేము మనుషులం చూడబోతే లిల్లిపుట్లలా ఎంతో అల్పులం; మేము దాని కడుపులోకి సొరంగం తవ్వుతున్న మహాపర్వతం చూడబోతే ఆకాశం అంచుల్ని తాకుతోంది. ఆ అంతరాన్ని అర్థంచేసుకోవాలంటే, మీరు కళ్ళారా చూసితీరవలసిందే! ఒకప్రక్క నల్లగా నోరు తెరుచుకున్నట్టు మేము తవ్విన సొరంగం; సూర్యాస్తమయం తర్వాత అందులోకి చొరబడిన మాలాంటి అల్పజీవులు; తనను విడిచి భూమి సొరంగంలోకి వెళ్తున్న మాలాంటి వాళ్లని సూర్యుడు ఎంతజాలిగా చూస్తాడో తెలుసా! మీరు మా మిషన్లనీ, అలా తీవ్రంగా చూస్తున్న పర్వతాలనీ చూసి తీరాల్సిందే! అక్కడి గరగరలూ, పిచ్చివాడి నవ్వులాంటి పేలుళ్ళూ వినాల్సిందే.”

అతను తన చేతులవంక చూసుకున్నాడు. అతని నీలి కోటుమీద పతకాన్ని సరిగ్గా సవరించుకొని ఒక నిట్టూర్పు విడిచాడు.

“మనిషికి ఎలా కష్టపడాలో తెలుసు,” అంటూ మళ్ళీ ప్రారంభించాడు. ఆ మాటల్లో గర్వం తొంగిచూస్తోంది. “దొరా! మనిషి అల్పుడే. కానీ అతను పనిచెయ్యాలని గట్టిగా నిశ్చయించుకుంటే, అతన్ని ఎదిరించగల శక్తి మాత్రం సృష్టిలో లేదు! నా మాట నమ్మండి, చివరకి, ఈ అల్పుడైన మనిషే తాను అనుకున్నది సాధిస్తాడు. మా నాన్న మొదట్లో అది నమ్మలేదు.

“‘ఒక దేశంలోంచి మరొక దేశంలోకి కొండ తవ్వడమా? అది, దేశాలని పర్వతాల హద్దులతో నిర్ణయించిన భగవంతుని సంకల్పానికి విరుద్ధం; మేరీమాత అనుగ్రహం మనమీద ఉండదు!’ అన్నాడు. కానీ ఆ ముసలాడు పొరబడ్డాడు.  మేరీమాత ఆమెని ఎవరుప్రేమిస్తే వారివైపు ఉంటుంది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నట్టు, మీతో మనసువిప్పి మాటాడుతున్నట్టు, అతనుకూడా ఆలోచించడం ప్రారంభించేడు. ఎందుకంటే అతనికి తను పర్వతాలకంటే బలవంతుడినన్న అభిప్రాయం కలిగింది. కానీ, అప్పుడప్పుడు, శలవుల్లోనో, ప్రక్కని మందుసీసాతో టేబిలుదగ్గరకూచున్నప్పుడో,  నాతోనూ, తక్కినవాళ్లటోనూ ఇలా అంటుండేవాడు:

 “‘భగవంతుని బిడ్డలారా!’… అంటూ ఎత్తుకునేవాడు. అతనికి అలా పిలవడం చాలా ఇష్టం. అతనిది వెన్నలా మెత్తని మనసు. ‘భగవంతుని బిడ్డలారా! మీరు నేలతో అలా పోరాడకూడదు. మీరు చేసిన గాయాలకి ఎప్పుడో ఒకప్పుడు ఆమె పగ తీర్చుకుంటుంది. ఆమె మీకు జయించశక్యం కాదు. మీరే చూద్దురుగాని! మనం అలా కొండ లోపలకి, భూదేవి గుండెకాయదాకా చొచ్చుకుపోయిన తర్వాత, ఆ గుండెకాయని ముట్టుకున్న మరుక్షణం మనందర్నీ మాడ్చి మసిచేస్తుంది. మనమీద నిప్పులు కురిపిస్తుంది. ఎందుకంటే భూమి గుండెల్లో నిప్పుంది గనుక. ఆ సత్యం మనకందరికీ తెలిసిందే! వ్యవసాయం చెయ్యడం అంటే, ఆమె ప్రసవానికి మనం సహాయం చేస్తున్నట్టు లెక్క.  మనల్ని అలా చెయ్యమనే భగవంతుడు ఆదేశించాడు.  మనం ఇప్పుడు భూదేవి రూపురేఖల్ని పాడుచేస్తున్నాం. దాని ఆకారాన్ని మారుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి! మనం ఎంతలోతుకి వెళుతుంటామో, లోపల గాలి అంత వేడెక్కుతూ మనకి ఊపిరి పీల్చుకోవడం అంత కష్టం అయిపోతుంది.”

ఆ మనిషి ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ అతని రెండుచేతులతో మీసం అంచుల్ని మెలేస్తుండేవాడు.

“అలా ఆలోచించింది అతనొక్కడే కాదు. అతనన్నది నిజం. మేము లోపలికి వెళుతున్నకొద్దీ గాలి వేడిగా ఉండేది. మనుషులు నేలమీద సాగిలపడేవారు. అక్కడి వేడినీటి చెలమలనుండి ఆవిర్లుకక్కుతున్న నీరు ఒక్కసారి పెల్లుబుకుతూ వచ్చేది. ఒక్కసారి కూప్పకూలిపోయినట్టనిపించేది. లుగానో నుండి వచ్చిన మా తోటిపనివాళ్ళిద్దరికి పిచ్చిపట్టింది. రాత్రిపూట బారకాసుల్లో మాలో చాలామందిమి అపస్మారకంలో ఉన్నవాళ్లలా మాటాడేవాళ్లం. భయంతో అరుస్తూ, గెంతులేస్తూ నిద్రలోంచి లేస్తుండేవాళ్లం.

“‘నే చెప్పలేదూ?’ అనేవాడు మా నాన్న, కళ్ళల్లో భయంతో, దగ్గుతూ దగ్గుతూ, రాను రాను అతని గొంతు బొంగురుపోతుంటే. అవును దొరా! అలానే అనే వాడు. ‘నే చెప్పలేదూ? భూదేవిని జయించడం మనవల్ల కాదు!’

“ఆఖరుసారిగా ముసలాయన మంచం ఎక్కేడు. అయినా అతను మంచి మనోబలంగలవాడు. మూడువారాల పాటు మృత్యువుతో చాలా ధైర్యంగా పోరాడేడు. తన విలువ తనకి తెలిసినవ్యక్తిలా ఎన్నడూ ఎవరినీ నిందించలేదు.

“‘పాలో! నేను వచ్చిన పని అయిపోయింది.’ అన్నాడు ఒక రోజు రాత్రి నాతో. ‘నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో! ఇంటికి తిరిగి వెళ్ళిపో! మేరీమాత నిన్ను దయతో చూడుగాక!’

“అలాఅన్న చాల సేపటివరకు ఏం మాటాడలేదు; ముఖం చేతుల్లో కప్పుకున్నాడు. ఊపిరి సలపదేమోనన్నంత భయం వేసింది.”

ఆ మనిషి లేచి నిలుచున్నాడు. మహాపర్వతం వంక చూసి ఒక్కసారి గట్టిగా ఒళ్ళు విరుచుకున్నాడు … కీళ్ళూ, మెటికలూ పటపటమనేలా.

“దొరా! అతను నా చెయ్యి తన చేతులోకి తీసుకుని, నన్ను దగ్గరగా పొదువుకుని ఇలా అన్నాడు. దొరా! నేను నిజమే చెబుతున్నా!

“‘కొడకా, పాలో! నువ్వో విషయం తెలుసుకో! ఇన్ని అనుకుంటున్నా, నా కనిపిస్తుంది మనం సాధించగలమని. పర్వతానికి ఇటునుంచి వెళుతున్న మనం, అటునుంచి వస్తున్న వాళ్ళూ, మధ్యలో ఎక్కడో కలుసుకుంటాం అని. నువ్వు నమ్మగలవా? ‘

“నాకు ఆ నమ్మకం ఉంది, నాన్నా!’

“అయితే, కొడకా, అది నువ్వు సాధించాలి. ప్రతీదీ అనుకూలంగా ముగుస్తాయన్న పూర్తి విశ్వాసంతో పనిచెయ్యాలి. మేరీమాత దయవల్ల భగవంతుడు మంచివాళ్ళ ప్రార్థనలు విని సహాయం చేస్తాడని నమ్మాలి. కొడకా నీన్నొక ఆఖరికోరిక కోరుతున్నాను. అనుకున్నట్టుగా జరిగి, అటువాళ్ళూ ఇటూవాళ్ళూ సొరంగంలో కలుసుకున్న తర్వాత, నా సమాధిదగ్గరకి వచ్చి, ‘నాన్నా, అనుకున్నట్టుగా జరిగింది! ‘ అని బిగ్గరగా చెప్పు నాకు తెలిసేలా!’

“’అలాగే నాన్నా!’ అని మాట ఇచ్చేను.  నేను మాట ఇచ్చిన 5 రోజులకి ఆయన మరణించేడు.  మరణించడానికి రెండురోజులముందు, తను సొరంగంలో ఎక్కడ చివరిసారిగా పనిచేసేడో అక్కడ సమాధి చెయ్యమని కోరాడు. అతను కడసారి ప్రార్థనలు చేశాడుగాని, అదంతా అపస్మారకంలో చేసినది.

“సరిగ్గా మా తండ్రి చనిపోయిన 13 వారాల తర్వాత, మేమూ, అటుపక్కనుండి పర్వతంలో సొరంగం తవ్వుకుంటూ వచ్చిన వాళ్ళూ కలుసుకున్నాం.  దొరా! ఏం చెప్పమంటారు! అదొక పిచ్చి ఆనందం కమ్ముకున్న రోజు. ఆ చిమ్మ చీకట్లో, నేలమాళిగలో, అవతలి ప్రక్క పనివారి మాటలు, మమ్మల్ని  కలుసుకుందికి వస్తున్నవారి మాటలు మొదటిసారి లీలగా వినిపించిన తర్వాత… దొరా, మీరు ఊహించండి, అల్పులైన మాలాటివాళ్లని తన బరువుతో పచ్చడి చెయ్యగల అపరిమితమైన బలంకలిగిన భూమి బరువుక్రింద, ఒక్కసారి అలా కలుసుకోవడం ఎంత బాగుంటుందో!

“కొన్ని రోజులపాటు ఆ గరగరలు విన్నాం. రోజు రోజుకీ ఆ మాటలు స్పష్టంగానూ, బిగ్గరగానూ, అవడం ప్రారంభించడంతో, మాలో విజేతలలో ఉండే ఉత్తేజం ఆవహించి, మేము రాక్షసులమన్నట్లూ, మాకు అసలు శరీరంగాని, అలసటగాని లేనట్టూ, మాకు ఏ నిర్దేశనం అక్కరలేనట్టూ, పనిచేశాం. నామీద ఒట్టేసి చెబుతున్నా! చివరకి, అదొక వసంతవేళ చేసే నాట్యంలా ఆనందంగా అనిపించింది. పిల్లల్లా ఒకరిపట్ల ఒకరు ఎంతో ప్రేమగా ప్రవర్తించడం ప్రారంభించాం. అసలు, ఎన్నో నెలలపాటు మరొక మనిషిని కలవడానికి ఎలుకలా చిమ్మచీకట్లో భూమిలో కలుగుతవ్వుకుంటూ తవ్వుకుంటూ పోయిన తర్వాత, ఆ సమావేశంకోసం ఎంత ఆరాటంగా ఉంటుందో మీరు తెలుసుకోగలిగితే ఎంతో బాగుంటుంది!”

ఆ మాటలు అంటున్నప్పుడు అతని ముఖం సిగ్గుతో ఎర్రబడింది.  అతని మాటలు వింటున్న వ్యక్తిదగ్గరకి పోయి, అతని ముఖంలో ముఖం పెట్టి చూశాడు. లోతైన ఆ కళ్ళలో మెరుపు కనిపించింది. మళ్ళీ తనే ప్రశాంతంగా ఇలా చెప్పడం ప్రారంభించేడు:

“కడసారిగా మా మధ్యనున్న గోడ బద్దలయింది. ఒక త్రోవ ఏర్పడింది. అందులోంచి ఎర్రని టార్చిలైటు వెలుగూ, ఎవరిదో కన్నీళ్ళతో నిండిన అస్పష్టమైన ముఖమూ కనిపించాయి. తర్వాత మరో ముఖం, మరికొన్ని టార్చిలైట్లు, మరికొన్ని ముఖాలు… ఆనందంతో నిండిన అరుపులూ, జయజయధ్వానాలూ మారుమోగేయి.  ఓహ్! ఏం చెప్పను! నా జీవితంలో మరిచిపోలేని రోజది! అది తలుచుకున్నప్పుడల్లా, నా జీవితం వృధాగా గడపలేదన్న సంతృప్తి కలుగుతుంది నాకు! దొరా! ఆ పని, నా పని, పవిత్రమైన పని! నిజం. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను! మేమంతా నేలని ముద్దాడాం! దొరా! ఆ రోజు నాకు నిజంగా ఈ నేల నాకు ఎంతో ఇష్టంగా, ఆప్యాయంగా కనిపించింది! నేను ఈ నేలంటే ప్రేమలో పడిపోయాను… అదొక ప్రియురాలైనట్లు!

“నేను మా నాన్న సమాధి దగ్గరకి వెళ్ళాను. … నాకు చనిపోయిన వాళ్ళు వినగలరని తెలియక పోయినప్పటికీ… అక్కడికి వెళ్ళేను. మనకోసం కష్టపడినవాళ్ళ కోరికలు తీర్చడం కోసం, మనకంటే తక్కువేమీ కష్టపడని వాళ్ల కోసం, దొరా, మనం ఆ మాత్రం చెయ్యొద్దూ?”

“చెయ్యాలి. తప్పకుండా చెయ్యాలి.  మా తండ్రి సమాధిదగ్గరకి పోయి, నేలమీద కాలితో ఒక్క సారి గట్టిగా సైనికుడిలా తట్టిశబ్దం చేసి, అతను కోరినట్టుగానే, ఇలా చెప్పాను:

“నాన్నా! సాధించాం! మనుషులు జయించారు. నాన్నా! అనుకున్నపని పూర్తయింది!”

.

మాగ్జీం గోర్కీ

 (మార్చి 28, 1868 – జూన్ 18, 1936)

 రష్యను కథకుడు

.

Man and the Simplon

A blue lake is deeply set in mountains capped with eternal snow. A dark network of gardens descends in gorgeous folds to the water. White houses that look like lumps of sugar peer down from the bank into the lake; and everything around is as quiet and peaceful as the sleep of a child.

It is morning. A perfume of flowers is wafted gently from the mountains. The sun is new risen and the dew still glistens on the leaves of trees and the petals of flowers. A road like a grey ribbon thrusts into the quiet mountain gorge — a stone-paved road which yet looks as soft as velvet, so that one almost has a desire to stroke it.

Near a pile of stones sits a workman, like some dark coloured beetle; on his breast is a medal; his face is serious, bold, but kindly.

Placing his sunburnt hands on his knees and looking up into the face of a passer-by who has stopped in the shade of a chestnut-tree, he says:

“This is the Simplon, signor, and this is a medal for working in the Simplon tunnel.”

And lowering his eyes to his breast he smiles fondly at the blight piece of metal.

“Oh, every kind of work is hard for a time, until you get used to it, and then it grows upon you and becomes easy. Ay, but it was hard work, though!”

He shook his head a little, smiling at the sun; then suddenly he checked himself and waved his hand; his black eyes glistened.

“I was afraid at times. The earth must have some feeling, don’t you think? When we had burrowed to a great depth, when we had made this wound in the mountain, she received us rudely enough. She breathed a hot breath on us that made the heart stop beating, made the head dizzy and the bones ache. Many experienced this. Then the mother earth showered stones upon her children, poured hot water over us; ay, there was fear in it, signor! Sometimes, in the torchlight, the water became red and my father told me that we had wounded the earth and that she would drown us, would burn us all up with her blood — ‘you will live to see it!’ It was all fancy, like enough, but when one hears such words deep in the bowels of the earth — in the damp and suffocating dark ness, amid the plaintive splashing of water and the grinding of iron against stone — one forgets for the moment how much is fantasy. For everything was fantastic there, dear signor: we men were so puny, while the mountain, into whose belly we were boring, reached up to the sky. One must see in order to understand it. It is necessary to see the black gaping mouth cut by us, tiny people, who entered it at sunset — and how sadly the sun looks after those who desert him and go into the bowels of the earth ! It is necessary to see our machines and the grim face of the mountain, and to hear the dark rumblings in it and the blasts, like the wild laughter of a madman.”

He looked at his hands, set right the medal on his blue blouse and sighed.

“Man knows how to work!” he continued, with manifest pride. “Oh, signor, a puny man, when he wills to work, is an invincible force! And, believe me: in the end, the little man will do everything he wants to do. My father did not believe it, at first.

“‘To cut through a mountain from country to country,’ he said ‘is contrary to the will of God, who separated countries by mountain walls; you will see that the Madonna will not be with us!’ He was wrong, the old man; the Madonna is on the side of everyone who loves her. Afterwards my father began to think as I now think and avow to you, because he felt that he was greater and stronger than the mountain; but there was a time when, on holidays, sitting at a table before a bottle of wine, he would declare to me and others:

“‘Children of God’ — that was his favourite saying, for he was a kind and good man — “children of God, you must not struggle with the earth like that; she will be revenged on you for her wounds, and will remain unconquerable! You will see: when we bore into the mountain as far as the heart, when we touch the heart, it will burn us up, it will hurl fire upon us, because the earth’s heart is fiery — everybody knows that! To cultivate the soil means to help it to give birth — we are bidden to do that; but now we are spoiling its physiognomy, its form. Behold! The farther we dig into the mountain the hotter the air becomes and the harder it is to breathe.”

The man laughed quietly and curled the ends of his moustache with both hands.

“Not he alone thought like that, and he was right; the farther we went in the tunnel, the hotter it became, and men fell prostrate and were overcome. Water gushed forth faster from the hot springs, whole seams fell down, and two of our fellows from Lugano went mad. At night in the barracks many of us talked in delirium, groaned and jumped up from our beds in terror.

” ‘Am I not right ?’ said my father, with fear In his eyes and coughing more and more, and more and more huskily — he did, signor. ‘Am I not right?’ he said. ‘She is unconquerable, the earth!’

“At last the old man lay down for the last time. He was very strong, my old one; for more than three weeks he struggled bravely with death, as a man who knows his worth, and never complained.

“‘My work is finished, Paolo,’ he said to me once in the night. ‘Take care of yourself and return home; let the Madonna guide you!’

“Then he was silent for a long time; he covered up his face, and was nigh to choking.”

The man stood up, looked at the mountains and stretched himself with such force that his sinews cracked.

“He took me by the hand, drew me to himself and said — it’s the solemn truth, signor —

” ‘Do you know, Paolo, my son, in spite of all, I think it will be done; we and those who advance from the other side will meet in the mountain, we shall meet — do you believe that?’

 “I did believe it, signor.”

‘Well, my son, so you must: everything must be done with a firm belief in a happy ending and in God who helps good people by the prayers of the Madonna. I beg you, my son, if it does happen, if the men meet, come to my grave and say: “Father, it is done,” so that I may know!’

 “It was all right, dear signor, I promised him. He died five days after my words were spoken, and two days before his death he asked me to bury him on the spot where he had last worked in the tunnel. He prayed, but I think it was in delirium.

“We and the others who came from the opposite side met in the mountain thirteen weeks after my father’s death — it was a mad day, signor! Oh, when we heard there, under the earth, in the darkness, the noise of other workmen, the noise of those who came to meet us under the earth — you understand, signor, under the tremendous weight of the earth which might have crushed us, puny little things, all at once had it but known how !

“For many days we heard these rumbling sounds ; every day they became louder and louder, clearer and clearer, and we became possessed by the joyful madness of conquerors — wo worked like demons, like persons without bodies, not feeling fatigue, not requiring directions — it was as good as a dance on a sunny day, upon my word of honor! We all became as good and kind to one another as children are. Oh, if you only knew how intensely passionate is one’s desire to meet a human being in the dark, under the earth into which one has bur rowed like a mole for many long months!”

His face flushed, he walked up close to the listener and, looking into the latter’s face with deep kindling eyes, went on quietly and joyously:

“And when the last wall finally crumbled away, and in the opening appeared the red light of a torch and somebody’s dark face covered with tears of joy, and then another face, and more torches and more faces — shouts of victory resounded, shouts of joy. . . Oh, it was the best day of my life, and when I think of it I feel that I have not lived in vain! There was work, my work, holy work, signor, I tell you, yes! …. Yes, we kissed the earth — that day the earth was specially near and dear to me, signor, and I fell in love with it as if it had been a woman!

 “Of course I went to my father! Of course — although I don’t know that the dead can hear — but I went : we must respect the wishes of those who toiled for us and who suffered no less than we do — must we not, signor ? . . .

“Yes, yes, I went to his grave, knocked with my foot against the ground and said, as he wished:

 “‘Father — it is done!’ I said. ‘The people have conquered. It is done, father!’”

.

Maxim Gorky.

(28 March 1868 – 18 June 1936)

Russian

Story Courtesy: The Phoenix. Vol 2 N0. 3-4 February- March 1915   Ed: Michael Monahan

(https://play.google.com/books/reader?id=cerUAAAAMAAJ&printsec=frontcover&pg=GBS.PA269)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: