“బాధ దానంతట అదే పోతుందిలే,
భవిష్యత్తులో మంచిరోజులకై కలగను,
ఈ వేళ సంగతి మరిచిపో,” అంటూ మిమ్మల్ని
మీరు మోసం చేసుకుంటూ ఆమెకు చెప్పొద్దు.
మీకు చెప్పాలనిపిస్తే, బాధ వృధాగా
పోదని ఆమెకి చెప్పండి;
అది నేర్పే గుణపాఠం వల్ల కలిగే లాభం
అది కలిగించే నొప్పికి పదిరెట్లు ఎక్కువని చెప్పండి.
ఎప్పటిలాగే పాతమాటలతో ఊరడించకండి:
“త్వరలోనే అది మరిచిపోతుందిలే”- అని.
కటువైన సత్యం, నిజమే, అది
విచారించవలసిన విషయమే;
ఆమెకు ‘వేరే విషయాలపై మనసుపోనీ,
కొత్త ఆనందాన్ని వెతుక్కో,” అని చెప్పొద్దు.
బదులుగా, గూడుకట్టుకున్న ఆమె దుఃఖానికి ఉపచారం చేస్తూ
బందీ అయిన ఆమె మనసు కూనిరాగాలు తీయగలిగేలా ప్రోత్సహించు.
అంతకంటే, ఆమెని ధైర్యంగా ముందుకి అడుగెయ్యమను.
కొత్త ముఖాల్ని మనసారా పలకరించమను;
డాలూ కత్తి పట్టుకుని శత్రువుని ఎదిరించినట్టుకాకుండా
ఇద్దరు ఆత్మీయ మిత్రులు కలుసుకున్నట్టుగా;
నల్లని తన నునులేత రెక్కల్ని
బలంగా పొదువుకోమని చెబుతూ, దుఃఖం
ఎప్పుడూ తోడుగా తీసుకువచ్చే ఆశీస్సుల
గుసగుసలను వినమని ఆమెకి ఉపదేశించు.
.
ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్
(30 October 1825 – 2 February 1864)
అమెరికను కవయిత్రి
.
.
స్పందించండి