రోజు: ఆగస్ట్ 17, 2018
-
బాధాసఖుడు… ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్, అమెరికను కవయిత్రి
“బాధ దానంతట అదే పోతుందిలే, భవిష్యత్తులో మంచిరోజులకై కలగను, ఈ వేళ సంగతి మరిచిపో,” అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఆమెకు చెప్పొద్దు. మీకు చెప్పాలనిపిస్తే, బాధ వృధాగా పోదని ఆమెకి చెప్పండి; అది నేర్పే గుణపాఠం వల్ల కలిగే లాభం అది కలిగించే నొప్పికి పదిరెట్లు ఎక్కువని చెప్పండి. ఎప్పటిలాగే పాతమాటలతో ఊరడించకండి: “త్వరలోనే అది మరిచిపోతుందిలే”- అని. కటువైన సత్యం, నిజమే, అది విచారించవలసిన విషయమే; ఆమెకు ‘వేరే విషయాలపై మనసుపోనీ, కొత్త…