రోజు: ఆగస్ట్ 16, 2018
-
ఆ వయసుకి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఈ రాత్రి నా కళ్ళు మూసుకుని ఒక చిత్రమైన ఊరేగింపు నా కళ్ళముందునుండి పోవడం గమనిస్తాను… నీ ముఖాన్ని నేను అప్పటికింకా చూడకముందు రోజులు ఎంతో ఆశలహేలతో నా ముందునుండి నడిచిపోతుంటాయి; అవును! సిగ్గూ, సున్నితమైన మనసున్నరోజులు తరలిపోతాయి కన్నీటిపొరతో ఏమీ కనిపించకపోయినా నృత్యంచేసే నర్తకిలా అలా రోజులు గడచిపోయినా, గడచిన ప్రతిరోజూ నన్ను నీ సన్నిధికి చేరుస్తోందని తెలుసుకోలేకపోయాను; ఆ త్రోవలు చాలా ఇరుకుగా ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ప్రతీదారీ నన్ను నీ హృదయాసమీపానికే చేర్చింది……