టెలిఫోను సంభాషణ … వోలె సోయింకా, నైజీరియన్ కవి

అద్దె సబబుగానే ఉన్నట్టనిపించింది, ఆ ఇల్లున్న చోట

మనని ఎవరూ పట్టించుకోరు. యజమానురాలు చూడబోతే

అక్కడ ఉండటం లేదని ఖరాకండీగా చెప్పింది.

ఇక మిగిలిందల్లా నా అభిప్రాయం చెప్పడం ఒక్కటే.

“మేడం, మీకు ముందుగా చెప్పడం మంచిది

ఊరికే వృధాగా తిరగడం కంటే; నేను ఆఫ్రికనుని,” అన్నాను.

ఒక్కసారి అంతా నిశ్శబ్దం. మంచి పెంపకం

అదుపులో పెడుతున్న ఆవేశపు ఒత్తిడి నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది.

చాలా సేపటికి పెగిలిన ఆ స్వరం, లిప్ స్టిక్ అద్దుకుని,

పొడవాటి గోల్డ్ రోల్డ్ సిగరెట్టు వాసన వేస్తోంది.

నాకయితే, గొప్ప కంపుకొట్టింది.

“ఎంత నలుపేమిటి?”… తప్పు విన్నానా? లేదు, నేను తప్పు వినలేదు…

“అంటే, మీరు చామనచాయా లేక కారు నలుపా? అని.”

‘చామనచాయైతే -1, కారునలుపైతే -2 నొక్కండి’ అన్నట్టుంది.

ఒక్కసారి మాటలవెనకనున్న దుర్గంధం గుప్పుమంది.

నేను నిల్చున్న పబ్లిక్ బూత్ “ఎరుపు”, ఈ స్తంభానికున్న పెట్టె “ఎరుపు”,

అయినా,  రెండంతస్థుల “ఎర్ర” బస్సు నల్లని పొగకక్కుతూపోతోంది.

నిజం!!! సభ్యతలేని నా మౌనానికి సిగ్గుతో అవాక్కయి,

ఇంకా సులభంగా అడగాలనుకుందేమో. అందుకని ఆమె పునరాలోచించి

విషయం మీద ఊనిక మారుస్తూ మళ్ళీ అడిగింది :

 

“మీరు బాగా నలుపా లేక లేత నలుపా?” అని. నాకు జ్ఞానోదయం అయింది.

“మీ ఉద్దేశ్యం నలుపా లేక చాకొలేట్ నలుపా అనేగదా?”  ఆమె “ఔ”ననడంలో

 నైశిత్యం నన్నుగూర్చికాదేమోనన్న (కాకతాళీయంగా అడిగిందేమోనన్న)

సందేహాన్ని పటాపంచలు చేసింది. త్వరలోనే ఆమె స్థాయిలో

మాటాడడానికి రాజీపడిపోయాను. “అది పశ్చిమ ఆఫ్రికను గోధుమ” అన్నాను.

మరికొంచెం ఆలోచించి, “నా పాస్ పోర్ట్ లో ఉన్నట్టుగానే,” అన్నాను.

ఆ రంగు ఏమిటో ఆలోచనల వర్ణపటలంలో పరిక్షించుకుందికి మౌనం వహించి,

చివరకి అది అర్థాం కాలేదన్న సత్యం గ్రహించడంతో

ఆమె మాటాడుతున్న మాటల్లో ఆ అసహనం తొంగిచూసింది. “ఇంతకి ఏమిటా రంగు?”

” అదేమిటో నాకు అర్థం కాలేదు,” అని అంగీకరించింది.

“మీ పరిభాషలో “బ్రూనెట్” అంటారే అదీ.” అన్నాను.

అంటే నలుపే, అవునా?” “అంటా నలుపుకాదు నిజానికి.

ముఖం చూస్తే నల్లగా ఉంటుంది. కానీ మేడమ్, మీరు

నా తక్కిన శరీరాన్ని చూడాలి. నా అరచేతులు, అరి పాదాలు

ఉతికినట్టు తెల్లగా ఉంటాయి. రాపిడి, తెలివి తక్కువగా

అలా కూచుని కూచుని నా పిర్రలు బొంతకాకిలా నల్లబడిపోయాయి.

అవతలి అంచున ఫోను ఫోనుపెట్టబోతున్న చప్పుడూ వినబడుతుంటే,

ఆగండి ఆగండి, ఒక్క క్షణం ఆగండి మేడమ్ అని బతిమాలుతూ,

“పోనీ మీరే ఒక సారి నన్ను చూసి నిర్ణయించుకోకూడదూ?”

.

వోలె సోయింకా

Born: 13 July 1934 

నైజీరియన్ కవి

.

.

Telephone conversation

Wole Soyinka

The price seemed reasonable, location

Indifferent. The landlady swore she lived

Off premises. Nothing remained

But self-confession. “Madam,” I warned,

“I hate a wasted journey—I am African.”

Silence. Silenced transmission of

Pressurized good-breeding. Voice, when it came,

Lipstick coated, long gold-rolled

Cigarette-holder pipped. Caught I was, foully.

“HOW DARK?” . . . I had not misheard . . . “ARE YOU LIGHT

OR VERY DARK?” Button B. Button A. Stench

Of rancid breath of public hide-and-speak.

Red booth. Red pillar-box. Red double-tiered

Omnibus squelching tar. It was real! Shamed

By ill-mannered silence, surrender

Pushed dumbfoundment to beg simplification.

Considerate she was, varying the emphasis—

 “ARE YOU DARK? OR VERY LIGHT?” Revelation came.

 “You mean—like plain or milk chocolate?”

Her assent was clinical, crushing in its light

Impersonality. Rapidly, wavelength adjusted,

I chose. “West African sepia”—and as an afterthought,

“Down in my passport.” Silence for spectroscopic

Flight of fancy, till truthfulness clanged her accent

Hard on the mouthpiece. “WHAT’S THAT?” conceding,

 “DON’T KNOW WHAT THAT IS.” “Like brunette.”

 “THAT’S DARK, ISN’T IT?” “Not altogether.

Facially, I am brunette, but madam, you should see

The rest of me. Palm of my hand, soles of my feet

Are a peroxide blonde. Friction, caused—

Foolishly, madam—by sitting down, has turned

My bottom raven black—One moment madam!”—sensing

Her receiver rearing on the thunderclap

About my ears—“Madam,” I pleaded, “wouldn’t you rather

See for yourself?”

.

Wole Soyinka

Born 13 July 1934

Nigerian Poet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: