హెన్రీ వాన్ సమాధి దగ్గర… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
గలగలలాడుతూ పారుతున్న నదికి ఎగువన
అదిగో సాదాసీదాగా కనిపిస్తున్న ఆకుపచ్చ సమాధిఫలకం
ఎవరికీ కనిపించకుండా, యూ చెట్టు చాటున కనుమరుగై ఉంది.
ఇక్కడే హెన్రీ వాన్ నిద్రిస్తున్నాడు, అతని పేరు శాశ్వతంగా
మంచుకడిగిన వనదేవతలా, మన ఊహకికూడా అందనంత
కాలం నక్షత్రాల వెలుగులా నిలిచిపోతుంది.
అందరూ ఇష్టపడ్డ డాక్టరు, వేల్స్ కి చెందిన సిలూరిస్ట్
ఇక్కడే నిద్రిస్తున్నాడు, అతనెలా ఉంటాడో తెలిపే చిత్తరువులూ లేవు.
అతని మనసులో దేవదూతలు వసించేవారు, అతను
మనోనేత్రాలతోనే ప్రభాతవెలుగులు దర్శించేవాడు.
ఇక్కడ విశ్వాసం, దయ, వివేకం, వినయం,
(వాటి ప్రభావం ఇప్పటికీ నిలిచి ఉంటుంది)
వెలుగొందుతున్నాయి. సృష్టిలోని ప్రశాంతత ఈ చిరు సమాధి ప్రతిఫలిస్తుంది.
నే నీ మునివాకిట వినమ్రుడనై ప్రార్థించడానికి నిలబడ్డాను.
.
సీ ఫ్రై ససూన్
ఇంగ్లీషు కవి
(సిలూరిస్ట్: సిలూరియన్ తెగకు చెందిన వాడు)

Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm