.
ప్రియ మృత్యువా!
అన్నీ నీ రెక్కల క్రిందకి తీసుకుంటావు.
హతమార్చడానికికాదు,
కేవలం ఆకారం మార్చడానికి.
బాధలతో తపిస్తున్న
ఈ శరీరానికి
మరో రూపం ఇవ్వడానికి.
నువ్వు మళ్ళీ సుమారుగా ఇలాంటి వస్తువునే సృష్టించవేమోగాని
కానీ, ఎన్నడూ అక్షరాలా ఇదే వస్తువుని తయారుచెయ్యవు.
ఓ ప్రియ మృత్యువూ!
నీ మారు పేరు మార్పు కదూ?
.
లాంగ్స్టన్ హ్యూజ్
(February 1, 1902 – May 22, 1967)
అమెరికను కవి

స్పందించండి