ఎవరు ఎక్కువ ప్రేమించారు? … జోయ్ ఏలిసన్, అమెరికను కవయిత్రి

“అమ్మా! నువ్వంటే నాకిష్టం,” అన్నాడు జాన్
అని, తన పని మరిచి, తన కుళ్ళాయి మరిచి
తోటలో ఉన్న ఉయ్యాల ఊగడానికి పరిగెత్తాడు,
నీళ్ళూ, కట్టేలూ తెచ్చే బాధ్యత ఆమెకి వదిలేసి.

“అమ్మా! నువ్వంటే నాకిష్టం,” అంది ఎర్రబుగ్గల నీల్,
నువ్వంటే నా కెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను,”;
అంటూ రోజులో సగభాగం బుంగమూతి పెట్టుకుని సతాయించేది
చివరికి తను ఆటకి పరిగెత్తగానే సంతోషంగా ఊపిరిపీల్చుకుంది.

“అమ్మా! నువ్వంటే నాకిష్టం, ” అంది చిన్నారి ఫాన్,
“ఈ రోజు నీకు ఎంత వీలైతే అంత సాయం చేస్తాను,
ఈ రోజు బడిలేనందుకు ఆనందంగా ఉంది!”
అని ఉయ్యాలలో బిడ్డ నిద్రపోయేదాకా ఊచింది.

తర్వాత నెమ్మదిగా అడుగులేసుకుంటూ, చీపురు తెచ్చింది
గదంతా ఊడ్చి ఎక్కడి వస్తువులక్కడ సర్దింది,
రోజల్లా ఖాళీ లేకుండా తిరుగుతూ ఎంతో ప్రసన్నంగా ఉంది
పిల్లలు ఎంతవరకు అమ్మకి ఏ సాయం చెయ్యగలరో అది చేస్తూ.

“అమ్మా, నువ్వంటే నాకిష్టం” అని మళ్ళీ అందరూ అన్నారు
పక్కమీదకి ముగ్గురు పిల్లలూ వాలిపోబోతూ.
వాళ్ల ముగ్గురిలో ఎవరికి నిజంగా అమ్మంటే ప్రేమో
తల్లి ఎలా తెలుసుకుందో మీరు చెప్పగలరా?
.
జోయ్ ఏలిసన్

అమెరికను కవయిత్రి

.

Which Loved Best?

.

“I love you, Mother,” said little John;

Then, forgetting his work, his cap went on,

And he was off to the garden-swing,

And left her the water and wood to bring.

“I love you, Mother,” said rosy Nell —

“I love you better than tongue can tell;”

Then she teased and pouted full half the day

Till her mother rejoiced when she went to play.

“I love you, Mother,” said little Fan;

“To-day I’ll help you all I can;

How glad I am school doesn’t keep!”

So she rocked the babe till it fell asleep.

Then, stepping softly, she fetched the broom

And swept the floor and tidied the room;

Busy and happy all day was she,

Helpful and happy as child could be.

“I love you, Mother,” again they said,

Three little children going to bed.

How do you think that mother guessed

Which of them really loved her best?

.

Joy Allison

American Poetess

19th Century

(The author of this poem, Mary A. Cragin, wrote under the pen name Joy Allison. Most of Mrs. Cragin’s stories and poems appeared in magazines. She also published two stories in book form: “Billow Prairie” and “Conrad and the House Wolf.” In addition to magazines, “Which Loved Best” turned up in Sunday school lessons and grade school readers. You can find it in second grade readers as early as 1879 on Google Books.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: