“నాకు,” అంది బాతు, “అది గొప్ప సరదాగా ఉంటుంది. ఎందుకంటే, అప్పుడు నేను కాళ్ళతో ఈదొచ్చు మెత్తని బురదలో నడిచేప్పుడు, మూడు కాలివ్రేళ్ళ ముద్రలు పడతాయి… క్వాక్! క్వాక్!!”
“నాకు,” అని అరిచింది డేండిలియన్ పువ్వు. “నా మొగ్గలు ఎండిపోయాయి, వేళ్ళు నీటికై తపిస్తున్నాయి,” అంది, పచ్చగా ఒత్తుగా ఉన్న తన గడ్డి పరుపు మీంచి తన చిందరవందరగా ఉన్న తల పైకెత్తుతూ.
సెలయేరు పాట అందుకుంది,”ప్రతి చినుకుకీ స్వాగతం, వాన చినుకులారా! చిత్తుగా కురవండి! నన్ను మీరొక నదిలా పొంగించేదాకా తెరిపి ఇవ్వొద్దు. అప్పుడు నేను మిమ్మల్ని సముద్రందాకా మోసుకుపోతాను.
“నాకు,” అన్నాడు టెడ్, “అప్పుడు నేను పొడవాటి బూట్లు తొడుక్కుని, రెయిన్ కోటు వేసుకుని బడికెళ్ళే దారిలో కనిపించే ప్రతి బురదగుంట, పిల్ల కాలువ, నీటిచెలమలోంచీ పరిగెత్తొచ్చు! . క్లారా డోటీ బేట్స్,