రోజు: మే 24, 2018
-
నీతి శాస్త్రం.. లిండా పాస్టన్, అమెరికను కవయిత్రి
[లిండా పాస్టన్ నైతికత విలువలకి సంబంధించి ఒక చక్కని ప్రశ్న తీసుకుని, బాల్యంలో నైతిక విలువలు అర్థంచేసుకోవడం ఎంత సంక్లిష్టమో, నైతికతమీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం ఎంత కష్టమో సూచిస్తుంది. అంతే కాదు, ఆ వయసులో కళాత్మకత కంటే, జీవితంవైపే ఎక్కువ మొగ్గు ఉంటుందని సూచిస్తుంది. పాఠకులు దీన్ని ఇంకా నిశితంగా విశ్లేషించుకోవచ్చు.] చిన్నప్పుడు మాకు నైతికశాస్త్రం పాఠాలు చెబుతున్నప్పుడు ప్రతి ఏడూ శరత్తులో మా ఉపాధ్యాయురాలు ఈ ప్రశ్న అడుగుతుండేవారు: ఒకవేళ ఏదైనా ఒక మ్యూజియంలో…