ఒక రోజు పొలంలో ఒక దిష్టిబొమ్మ నిలబెట్టి ఉంది పచ్చగడ్డి కూరేరు ఎండుగడ్డి కూరేరు అది రాజమార్గంలో పోతున్న మనుషుల్ని చూస్తోంది కాని ఒక్కమాట మాటాడితే ఒట్టు
అది చాలా సంగతులు చూసింది, కాని ఒకటీ వినలేదు దానికి రాత్రి లేదు పగలు లేదు దానికి ఏమీ లేకపోవడంతో, ఏదీ అక్కరలేకపోవడంతో ఒక్క మాటన్నా మాటాడలేదు.
ఒక నల్లని ఎలుక ఒక గూడు పెట్టుకుంది ఎంత బుజ్జిగా ఉందో ఎంత నల్లగ ఉందో పాపం టామ్ కి ఉన్న మంచి కోటుచెయ్యిలో గూడుపెట్టింది అయినా, దిష్టిబొమ్మ ఏమీ అనలేదు.
టామ్ టోపీలో ఒక ఆడ పిట్ట ఇల్లుకట్టింది ఎంత అందంగా ఉందో ఎంత ఖుషీగా ఉందో ఒక ఉడుత మనుషులంటే భయం పక్కనబెట్టి టామ్ ని ముద్దుపెట్టుకుంది. ఐనా అతనేం అనలేదు.
పాపం చివికి జీర్ణమైపోయినవాడు.అతనంటే నాకు ఇష్టం పచ్చగడ్డి కూరేరు ఎండుగడ్డి కూరేరు అతను ఎన్నో కథలు చెప్పగలడు కానీ ఏనాడూ ఒక్క మాటమాటాడితే ఒట్టు. . మైకేల్ ఫ్రాంక్లిన్
(ఈ కవి గురించి వివరాలు ఇవ్వలేనందుకు చింతిస్తున్నాను)
స్పందించండి