సూర్యుడెప్పుడో అస్తమించాడు నక్షత్రాలు ఒక్కటొకటిగా మిణుకుమంటున్నాయి చెట్లగుబురుల్లో పిట్టలు ఇంకా రాగాలాపనలు అందుకోలేదు. అక్కడొక కోయిల ఇక్కడ ఒక రెండు పాలపిట్టలూ దూరాన్నుండి ఎగసివస్తున్న సుడిగాలి పక్కనే పారుతున్న సెలయేటి పాట ఒక్కసారిగా దిగంతాలవరకూ సాగుతూ రోదసిని ముంచెత్తుతున్న కోయిల పాట…
ఇవన్నీ ఉంటే ఎవడయ్యా ఇటువంటి జూన్ రాత్రిలో ఆడంబరంగా లండను పోయేది? మారువేషాలతో ఆటలాడేది? అంత మెత్తని వెన్నలాంటి అర్థచంద్రుడూ ఇంత ఖర్చులేని ఆనందాలూ దొరుకుతుంటే? అందులో ఇంత చక్కని రాతిరి? . విలియమ్ వర్డ్స్ వర్త్ (7 ఏప్రిల్ 1770 – 23 ఏప్రిల్ 1850) ఇంగ్లీషు కవి
.
A Night in June
(This Impromptu appeared, many years ago, among the Author’s poems, from which, in subsequent editions, it was excluded. It is reprinted at the request of the Friend in whose presence the lines were thrown off.)