అనువాదలహరి

నువ్వు పక్షిలా బ్రతుకు … విక్టర్ హ్యూగో, ఫ్రెంచి కవి

నువ్వు పక్షిలా బ్రతుకు.

ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ

విశ్రాంతికి చెట్టుకొమ్మ మీద వాలినపుడు

అల్పమైన దాని బరువుకే

కాలి క్రింద కొమ్మ విరగబోతున్నా

అది పాడుతూనే ఉంటుంది

తనకి రెక్కలున్నాయన్న ధైర్యంతో!

.

విక్టర్ హ్యూగో

26 February 1802 – 22 May 1885

ఫ్రెంచి కవి, నాటకకర్త, నవలా కారుడు

.

Be Like the Bird

.

Be like the bird, who

Halting in his flight

On limb too slight

Feels it give way beneath him,

Yet sings

Knowing he hath wings.

.

Victor Hugo

26 February 1802 – 22 May 1885

French  Poet, Novelist and Dramatist 

Poem Courtesy:

https://www.poetrynook.com/poem/be-bird-0

ప్రతిధ్వని… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి

“ఎవరది పిలిచింది?” అన్నాన్నేను. నా మాటలు

ఊసులాడుతున్న వనసీమలలోంచి,

ఇటూ అటూ పోతూ పిట్టల్ని గాభరాపెట్టేయి

“ఎవరది పిలిచింది? ఎవరది పిలిచింది?” అంటూ.

చిటారుకొమ్మలనున్న ఆకులు

ఎండలో గలగలలాడాయి

ఎండకాగిన పొడిగాలి నా అరుపుని

సన్నగా మోసుకుపోయింది:

పచ్చదనం మద్య తొంగి చూస్తున్న కళ్ళూ, నీడలోనున్నవీ

కదలకుండా పడున్న డొంకలోని గొంతులు

నన్ను వెక్కిరించడానికి

నే నేమంటే తిరిగి అదే అంటున్నాయి.

నా కన్నీళ్ళలోంచి ఒక్క సారి అరిచేను: “ఎవడికి ఖాతరు?” అని;

గాలి ఒక్కసారి పల్చబడింది:

ఆ నిశ్శబ్దంలో “ఎవడికి ఖాతరు? ఎవడికి ఖాతరు?”

అన్నమాట ముందుకీ వెనక్కీ ఊగిసలాడింది.

.

వాల్టర్ డి లా మేర్

25 April 1873 – 22 June 1956

ఇంగ్లీషు కవి

.

.

Echo

.

“Who called?” I said, and the words

Through the whispering glades,

Hither, thither, baffled the birds—

“Who called? Who called?”

The leafy boughs on high

Hissed in the sun;

The dark air carried my cry

Faintingly on:

Eyes in the green, in the shade,

In the motionless brake,

Voices that said what I said,

For mockery’s sake:

“Who cares?” I bawled through my tears;

The wind fell low:

In the silence, “Who cares? Who cares?”

Wailed to and fro.

.

Walter de la Mare

25 April 1873 – 22 June 1956

British Poet

Poem Courtesy:

https://www.poetrynook.com/poem/echo-7

చిరునవ్వు- రౌల్ ఫొలేరో, ఫ్రెంచి రచయిత

చిరునవ్వుకి కాణీ ఖర్చులేదు, కానీ చాలా ప్రసాదిస్తుంది.

దానికి కొన్ని లిప్తలు పడుతుంది కానీ దాని ప్రభావం శాశ్వతం.

అది లేకుండా బ్రతకగలిగిన ధనవంతులెవరూ ఉండరు,

దాన్ని ఇవ్వడం వలన పేదవాళ్ళయిపోయేవారెవరూ ఉండరు.

అది ఇచ్చేవాళ్ళని పేదవాళ్ళని చెయ్యకుండానే

పుచ్చుకునే వాళ్ళని ధనవంతుల్ని చేస్తుంది—

అది ఇంటిలో వెలుగు సృష్టిస్తుంది-

వ్యాపారంలో మంచిపేరు సంపాదిస్తుంది

అన్ని విషమ సమస్యలకీ విరుగుడుగా పనిచేస్తుంది.

అయినప్పటికీ, దాన్నెవడూ యాచించలేడు, అరువు తీసుకో లేడు,

దొంగిలించలేడు, ఎందుకంటే, అది అయాచితంగా ఇస్తేనే తప్ప

దానికి ఏ మాత్రం విలువలేదు.

కొందరికి చిరునవ్వుతో నిన్ను పలకరించడానికి తీరిక ఉండదు

కనుక, నువ్వే, నీ చిరునవ్వుతో వాళ్ళని పలకరించు.

ఎందుకంటే భగవంతుడికి తెలుసు: అసలు వాళ్ళదగ్గిర ఇవ్వడానికి

చిరునవ్వులు మిగలని వారే* … చిరునవ్వు గ్రహించడానికి పాత్రులు.

.

రౌల్ ఫొలేరో

17 Aug 1903-  6 Dec 1977

ఫ్రెంచి రచయిత

* చనిపోయినవారే

A Smile

.

A smile costs nothing but gives much—

It takes but a moment, but the memory of it usually lasts forever.

None are so rich that can get along without it—

And none are so poor but that can be made rich by it.

It enriches those who receive

Without making poor those who give—

It creates sunshine in the home,

Fosters good will in business

And is the best antidote for trouble—

And yet it cannot be begged, borrowed or stolen, for it is of no value

Unless it is freely given away.

Some people are too busy to give you a smile—

Give them one of yours—

For the good Lord knows that no one needs a smile so badly

As he or she who has no more smiles left to give.

.

Raoul Follereau

17 Aug 1903-  6 Dec 1977

French Writer

Raoul Follereau, born August 17, 1903 in Nevers and died December 6, 1977 in Paris, is a French writer and journalist, creator of the world day of fight against leprosy and founder of the work known today in France under the name of the Raoul-Follereau Foundation, which fights against leprosy and poverty and promotes access to education.

Poem Courtesy: https://www.poetrynook.com/poem/smile-1 

నేను మళ్ళీ ఈ త్రోవలో రాను… అజ్ఞాత కవి

[కాకతాళీయంగా మనకి ఈ మనుజ జన్మ వచ్చిందనీ, మనకున్న జీవితం ఒకటేననీ, మంచి అన్నది ఏది చేద్దామనుకున్నా దాన్ని వాయిదా వెయ్యకుండా ఒంట్లో శక్తీ, మనసులో తలపూ ఉన్నప్పుడే ఆచరించాలనీ సున్నితంగా చెప్పిన కవిత]

ఈ బాధామయ ప్రపంచం లోంచి,

ఒకే ఒక్కసారి నేను నడిచిపోతాను.

ఎవరికయినా మంచి చెయ్యాలన్నా

బాధపడుతున్న ఏ సాటిమానవుడిపట్లనైనా

కరుణ చూపించాలన్నా

నాకు ఒంట్లో శక్తి ఉన్నప్పుడే చెయ్యనీండి.

వాయిదా వెయ్యడానికి లాభం లేదు.

ఎందుకంటే నాకు స్పష్టంగా తెలుసు

ఈ త్రోవలో మళ్ళీ నేను రానని!

.

అజ్ఞాత కవి

I Shall Not Pass This Way Again

.

Through this toilsome world, alas!

Once and only once I pass,

If a kindness I may show,

If a good deed I may do

To a suffering fellow man,

Let me do it while I can.

No delay, for it is plain

I shall not pass this way again.

.

Anonymous

Poem Courtesy:

https://www.poetrynook.com/poem/i-shall-not-pass-way-again

నీతి శాస్త్రం.. లిండా పాస్టన్, అమెరికను కవయిత్రి


[లిండా పాస్టన్ నైతికత విలువలకి సంబంధించి ఒక చక్కని ప్రశ్న తీసుకుని, బాల్యంలో నైతిక విలువలు అర్థంచేసుకోవడం ఎంత సంక్లిష్టమో, నైతికతమీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం ఎంత కష్టమో సూచిస్తుంది. అంతే కాదు, ఆ వయసులో కళాత్మకత కంటే, జీవితంవైపే ఎక్కువ మొగ్గు ఉంటుందని సూచిస్తుంది. పాఠకులు దీన్ని ఇంకా నిశితంగా విశ్లేషించుకోవచ్చు.]

చిన్నప్పుడు మాకు నైతికశాస్త్రం పాఠాలు చెబుతున్నప్పుడు

ప్రతి ఏడూ శరత్తులో మా ఉపాధ్యాయురాలు ఈ ప్రశ్న అడుగుతుండేవారు:

ఒకవేళ ఏదైనా ఒక మ్యూజియంలో అగ్నిప్రమాదం సంభవిస్తే

మీరు ఏది ముందు కాపాడతారు? రెంబ్రాంట్ చిత్రాన్నా?

లేదా ఇక అట్టే రోజులు బ్రతకదని తెలిసిన

ఒక వృద్ధురాల్నా?అని. కూచున్న కుర్చీల్లో అసహనంగా కదుల్తూ

చిత్రానికీ, వృద్ధాప్యానికీ ఏ రకమైన విలువ ఇవ్వకుండా

ఒక ఏడు చిత్రాన్ని అని చెబితే మరోసారి ముసిలిదాన్ని అనే వాళ్లం.

ఎప్పుడుచెప్పినా అయిష్టంగానే చెప్పేవాళ్లం. ఒక్కోసారి

ఆ మిసిల్ది మా అమ్మమ్మ ముఖకవళికల్ని దొరకబుచ్చుకుని

అలవాటైన వంటగది విడిచిపెట్టి గాలిలో తేలుతూ

ఊహాప్రపంచంలోని మ్యూజియంలోకి వస్తుండేది.

ఒక ఏడు, చాలా తెలివిగా, ఇలా అన్నాన్నేను:

ఆ ముసిలిదాన్నే నిర్ణయించుకోనియ్యకూడదా? అని.

లిండా, మా ఉపాధ్యాయురాలు అంది:అది సమాధానం చెప్పే

బాధ్యతనుండి పలాయనంచిత్తగించే పద్ధతి అని.

ఈ ఏడు శరత్తులో నేను నిజమైన మ్యూజియంలో

నిజమైన రెంబ్రాంట్ చిత్రం ముందు, ముసిలిదాన్ని,

లేదా వయసుపైబడ్డ నేను, నిలుచున్నాను. ఆ చిత్రంలోని

రంగులు ఆకురాలుకాలం కన్నా చిక్కగా ఉన్నాయి,

అంతేనా, చలికాలంకన్నా గాఢంగా ఉన్నాయి… ఆ నేల రంగులు

నేలతో సహా మిరిమిట్లుగొలిపే పంచభూతాలూ

ఆ చిత్తరువులోంచి ఉబుకుతున్నట్టున్నాయి. నాకిపుడు

ఆ మిసిలిదీ, ఆ వర్ణచిత్రం, ఆ ఋతువులూ అన్నీ ఒక్కలా కనిపించి

అది రక్షించుకోదగిన చిత్రమని బాల్యం గుర్తిస్తుందని అనుకోను.

.

లిండా పాస్టన్

(Born May 27, 1932)

అమెరికను కవయిత్రి

Linda Pastan

Ethics

.

 

In ethics class so many years ago

our teacher asked this question every fall:

if there were a fire in a museum

which would you save, a Rembrandt painting

or an old woman who hadn’t many

years left anyhow? Restless on hard chairs

caring little for pictures or old age

we’d opt one year for life, the next for art

and always half-heartedly. Sometimes

the woman borrowed my grandmother’s face

leaving her usual kitchen to wander

some drafty, half imagined museum.

One year, feeling clever, I replied

why not let the woman decide herself?

Linda, the teacher would report, eschews

the burdens of responsibility.

This fall in a real museum I stand

before a real Rembrandt, old woman,

or nearly so, myself. The colors

within this frame are darker than autumn,

darker even than winter — the browns of earth,

though earth’s most radiant elements burn

through the canvas. I know now that woman

and painting and season are almost one

and all beyond saving by children.

.

Linda Pastan

America n Poet

(Born May 27, 1932)

దిష్టిబొమ్మ … మైకేల్ ఫ్రాంక్లిన్

ఒక రోజు పొలంలో ఒక దిష్టిబొమ్మ నిలబెట్టి ఉంది
పచ్చగడ్డి కూరేరు
ఎండుగడ్డి కూరేరు
అది రాజమార్గంలో పోతున్న మనుషుల్ని చూస్తోంది
కాని ఒక్కమాట మాటాడితే ఒట్టు

అది చాలా సంగతులు చూసింది, కాని ఒకటీ వినలేదు
దానికి రాత్రి లేదు
పగలు లేదు
దానికి ఏమీ లేకపోవడంతో, ఏదీ అక్కరలేకపోవడంతో
ఒక్క మాటన్నా మాటాడలేదు.

ఒక నల్లని ఎలుక ఒక గూడు పెట్టుకుంది
ఎంత బుజ్జిగా ఉందో
ఎంత నల్లగ ఉందో
పాపం టామ్ కి ఉన్న మంచి కోటుచెయ్యిలో గూడుపెట్టింది
అయినా, దిష్టిబొమ్మ ఏమీ అనలేదు.

టామ్ టోపీలో ఒక ఆడ పిట్ట ఇల్లుకట్టింది
ఎంత అందంగా ఉందో
ఎంత ఖుషీగా ఉందో
ఒక ఉడుత మనుషులంటే భయం పక్కనబెట్టి
టామ్ ని ముద్దుపెట్టుకుంది. ఐనా అతనేం అనలేదు.

పాపం చివికి జీర్ణమైపోయినవాడు.అతనంటే నాకు ఇష్టం
పచ్చగడ్డి కూరేరు
ఎండుగడ్డి కూరేరు
అతను ఎన్నో కథలు చెప్పగలడు
కానీ ఏనాడూ ఒక్క మాటమాటాడితే ఒట్టు.
.
మైకేల్ ఫ్రాంక్లిన్

(ఈ కవి గురించి వివరాలు ఇవ్వలేనందుకు చింతిస్తున్నాను)

.

The Scarecrow

.

A scarecrow stood in a field one day,

Stuffed with straw,

Stuffed with hay;

He watched the folk on the king’s highway,

But never a word said he.

Much he saw, but naught did heed,

Knowing not night,

Knowing not day,

For, having nought, did nothing need,

And never a word said he.

A little grey mouse had made its nest,

Oh so wee,

Oh so grey,

In a sleeve of a coat that was poor Tom’s best,

But the scarecrow naught said he.

His hat was the home of a small jenny wren,

Ever so sweet,

Ever so gay,

A squirrel had put by his fear of men,

And kissed him, but naught heeded he.

Ragged old man, I loved him well,

Stuffed with straw,

Stuffed with hay,

Many’s the tale that he could tell,

But never a word says he.

.

Michael Franklin

Poem Courtesy:

https://www.poetrynook.com/poem/scarecrow-5

అది సాధ్యమే… అజ్ఞాత కవి

ఎవడైతే “అది సాధ్యం కాదు” అని అంటాడో

వాడు జీవితంలోని సౌందర్యాన్ని కోల్పోతునట్టే.

అతను గర్వంగా ఒక ప్రక్క నిలబడి

అందరూ చేసే ప్రయత్నాలన్నిటినీ ఆక్షేపిస్తుంటాడు.

వాడికే గనక మానవజాతి చరిత్ర సమస్తాన్నీ

తుడిచిపెట్టే శక్తి ఉండి ఉంటే,

మనకి ఈ నాడు రేడియోలు, మోటారు కార్లు

వీధుల్లో విద్యుద్దీపాల కాంతులూ ఉండేవి కావు;

టెలిఫోన్లూ, తంతివార్తలూ లేక

మన రాతియుగంలో ఉన్నట్టే జీవించే వాళ్లం.

“అది సాధ్యపడదు” అని చెప్పేవాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తే

ప్రపంచం ఎప్పుడో మొద్దునిద్దరలో ఉండేది.

.

అజ్ఞాత కవి

It Can Be Done

.

The Man who misses all the fun,

Is he who says, “It can’t be done”

In solemn pride he stands aloof

And greets each venture with reproof.

Had he the power he’d efface

The history of the human race;

We’d have no radio or motor cars,

No streets lit by electric stars;

No telegraph nor telephone,

We’d linger in the age of stone.

The world would sleep if things were run

By men who say “It can’t be done.”

.

Anonymous.

Poem Courtesy: https://www.poetrynook.com/poem/it-can-be-done  

 

జూన్ నెలలో ఒక రాత్రి… విలియమ్ వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి

సూర్యుడెప్పుడో అస్తమించాడు
నక్షత్రాలు ఒక్కటొకటిగా మిణుకుమంటున్నాయి
చెట్లగుబురుల్లో
పిట్టలు ఇంకా రాగాలాపనలు అందుకోలేదు.
అక్కడొక కోయిల ఇక్కడ ఒక రెండు పాలపిట్టలూ
దూరాన్నుండి ఎగసివస్తున్న సుడిగాలి
పక్కనే పారుతున్న సెలయేటి పాట
ఒక్కసారిగా దిగంతాలవరకూ సాగుతూ
రోదసిని ముంచెత్తుతున్న కోయిల పాట…

ఇవన్నీ ఉంటే
ఎవడయ్యా ఇటువంటి జూన్ రాత్రిలో
ఆడంబరంగా లండను పోయేది?
మారువేషాలతో ఆటలాడేది?
అంత మెత్తని వెన్నలాంటి అర్థచంద్రుడూ
ఇంత ఖర్చులేని ఆనందాలూ దొరుకుతుంటే?
అందులో ఇంత చక్కని రాతిరి?
.
విలియమ్ వర్డ్స్ వర్త్
(7 ఏప్రిల్ 1770 – 23 ఏప్రిల్ 1850)
ఇంగ్లీషు కవి

 

.

A Night in June

(This Impromptu appeared, many years ago, among the Author’s poems, from which, in subsequent editions, it was excluded. It is reprinted at the request of the Friend in whose presence the lines were thrown off.)

The sun has long been set,

The stars are out by twos and threes,

The little birds are piping yet

Among the bushes and trees;

There’s a cuckoo, and one or two thrushes,

And a far-off wind that rushes,

And a sound of water that gushes,

And the cuckoo’s sovereign cry

Fills all the hollow of the sky.

Who would go “parading”

In London, and “masquerading,”

On such a night of June

With that beautiful soft half-moon,

And all these innocent blisses?

On such a night as this is!

.

William Wordsworth

(7 April 1770 – 23 April 1850)

English Poet

https://www.poetrynook.com/poem/night-june-3

రూబీ బ్రౌన్… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి

ఆమె యవ్వనవతి, అందగత్తె
ఆమె శరీరాన్ని నులివెచ్చన చేసే సూర్యరశ్మిలా
కొద్దిగా బంగారు మెరుపు ఉంది ఆమెలో.
కానీ, ఆమె నల్లజాతి యువతి కావడంతో
‘మేవిల్లే ‘ లో ఆమెకి చోటు లేదు
ఆమె మనసులో జ్వలిస్తూ స్వచ్ఛమైన జ్వాలలా
పైకి ఎగసిపడే ఆనందానికి అవకాశాలూ లేవు.

ఒక రోజు
మిసెస్ లాథామ్ ఇంటి వెనక పెరట్లో
గిన్నెలు తోముకుంటూ,
తనని తాను రెండు ప్రశ్నలు వేసుకుంది
ఆ రెండింటి సారాంశమూ సుమారుగా ఇది:
తెల్లజాతి స్త్రీ వంటింట్లో పనిచేసే
నల్లజాతి పిల్ల ఆ డబ్బు ఏంచేసుకుంటుంది?
ఈ ఊర్లో ఆనందించడానికి ఏమైనా ఉందా?

ఇప్పుడు నది దిగువగా ఉన్న వీధులన్నిటికీ
ఈ అందమైన పిల్ల రూబీ బ్రౌన్ గురించి ఎక్కువ తెలుసు
అక్కడ ఎప్పుడూ కిటికీలు మూసి చీకటిగా
ఉండే గదుల్లో ఈ పసుపుపచ్చని పిల్ల
తన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ బ్రతుకుతోంది.
చర్చికి వెళ్ళే నీతిమంతులైన ప్రజలు
ఆ పిల్ల పేరు ఇప్పుడు ఉచ్ఛరించరు.

కానీ, ఆ చీకటిగదుల ఇంటికి వెళ్లడానికి
అలవాటుపడ్డ తెల్లజాతి పురుషులందరూ
వాళ్ళ వంటిళ్ళల్లో ఆమె పనిచేస్తున్నపుడు
ఇంతకుముందు ఎన్నడూ ఇవ్వనంతగా
డబ్బు ముట్టజెప్ప సాగేరు.
.

లాంగ్స్టన్ హ్యూజ్

(February 1, 1902 – May 22, 1967)

అమెరికను కవి

.

Image courtesy: http://4.bp.blogspot.com

.

Ruby Brown

.

She was young and beautiful

And golden like the sunshine

That warmed her body.

And because she was colored

Mayville had no place to offer her,

Nor fuel for the clean flame of joy

That tried to burn within her soul.

One day,

Sitting on old Mrs. Latham’s back porch

Polishing the silver,

She asked herself two questions

And they ran something like this:

What can a colored girl do

On the money from a white woman’s kitchen?

And ain’t there any joy in this town?

Now the streets down by the river

Know more about this pretty Ruby Brown,

And the sinister shuttered houses of the bottoms

Hold a yellow girl

Seeking an answer to her questions.

The good church folk do not mention

Her name any more.

But the white men,

Habitués of the high shuttered houses,

Pay more money to her now

Than they ever did before,

When she worked in their kitchens.

.

Langston Hughes

(February 1, 1902 – May 22, 1967)

American

Poem Courtesy:

https://www.poetrynook.com/poem/ruby-brown

పొద్దుపొడుపు… H W లాంగ్ ఫెలో, అమెరికను కవి

సముద్రం మీంచి చిరుగాలి ఎగిసింది; 
“ఓ మంచు తెరలారా, నాకు దారి ఇవ్వండి,”  

ఓడలవంక చూస్తూ ఎలుగెత్తి, “నావికులారా!
తెరచాపలెత్తండి! రాత్రి ముగిసింది!” 

దూరాననున్న నేలమీదకి పరిగెత్తి అరిచింది,
“ఊఁ! ఊఁ! లేవండి తెల్లవారింది”  

అడవిదారులంటపరిగెత్తి “ఎలుగెత్తు!
నీ ఆకుల జండాలన్నీ రెపరెపలాడించు!”  

అది వడ్రంగిపిట్ట ముడుచుకున్న రెక్కలు సవరిస్తూ
“ఓ పిట్టా! లే! లే! నీ రాగం అందుకో!”  

పొలాలపక్కన కళ్ళాలకి పోయి, “ఓ, కోడి పుంజూ!
నీ బాకా ఊదు. తెల్లారబోతోంది!”  

బాగా పండిన పంటచేలలోకి దూరి,
“తలొంచుకోండి! ప్రభాతాన్ని స్తుతించండి”  

చర్చిగోపురానికి వేలాడుతున్న ఘంట దగ్గరకి పొయి
“ఓ ఘంటా! నిద్ర లే! సమయం ఎంతయిందో చెప్పు!”  

చర్చి వాకిళ్ళు ఉస్సురనుకుంటూ దాటుతూ,
‘సమయం రాలేదు! అందాకా పడుక్కునే ఉండండి!”  
.

హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో

(February 27, 1807 – March 24, 1882)

అమెరికను కవి

.

.

Daybreak

.

A wind came up out of the sea,        

And said, “O mists, make room for me!”  

It hailed the ships, and cried, “Sail on,      

Ye mariners, the night is gone!”       

And hurried landward far away,              

Crying, “Awake! It is the day!”        

It said unto the forest, “Shout!         

Hang all your leafy banners out!”    

It touched the wood-bird’s folded wing,    

And said, “O bird, awake and sing!”        

And o’er the farms, “O chanticleer, 

Your clarion blow; the day is near!”

It whispered to the fields of corn,    

“Bow down, and hail the coming morn!”  

It shouted through the belfry-tower,        

“Awake, O bell! proclaim the hour.”

It crossed the churchyard with a sigh,       

And said, “Not yet! in quiet lie.”

.

Henry Wadsworth Longfellow

(February 27, 1807 – March 24, 1882)

American Poet

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds Bliss Carman, et al.   

Volume V. Nature.  1904.

Light: Day: Night

http://www.bartleby.com/360/5/23.html

%d bloggers like this: