రోజు: ఏప్రిల్ 26, 2018
-
జీవితంలో అతిముఖ్యమైన విషయం… గ్రెన్ విల్ క్లీజర్, కెనేడియన్ అమెరికను కవి
నీకు ఏదో ఒక విషయం చెబుదామనిపించి అది చెబితే విచారించవలసి వస్తుందనీ తెలిసి, లేదా, ఒక అవమానం తీవ్రంగా పరిగణించి, అది అంత త్వరగా మరిచిపోలేననుకున్నప్పుడు అదే సరియైన తరుణం, నీ విచారాన్ని అణుచుకుని మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యడానికి, ఎందుకంటే, మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే మన చెడు ఆలోచనలన్నీ అణగారిపోతాయి. కోపం తెచ్చుకోవడం చాలా సుళువు ఒకరు మనని మోసగించినపుడూ, ఎదిరించినపుడూ; మనం కోరిన కోరికలు నెరవేర్చనపుడు చిటపటలాడుతూ, నిరుత్సాహపడడం సహజం; కానీ, మన…